సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యాక.. దిల్ రాజు (Dil Raju) , మైత్రి మూవీ మేకర్స్ వంటి బడా సంస్థలపై ఐటీ రైడ్స్ జరిగాయి. ‘పుష్ప 2’ (Pushpa 2) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కలెక్షన్ల పోస్టర్లపై కూడా ఐటీ అధికారులు గట్టిగా ఆరాతీశారు. తర్వాత దిల్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. మా లెక్కలు అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అదే క్రమంలో కలెక్షన్ల పోస్టర్లపై ఆయన అసహనం తెలుపుతూ కూడా కామెంట్లు చేశారు.
అయినా సరే ‘తండేల్’ (Thandel) సినిమాకి రూ.100 కోట్ల పోస్టర్ వేసుకున్నారు ‘గీతా ఆర్ట్స్’ వారు. ఆ సినిమా అంత కలెక్ట్ చేయలేదు అనే కామెంట్స్ కూడా ఆ టైంలో వినిపించాయి. అయితే ఈరోజు జరిగిన ‘ఛావా’ (Chhaava) ప్రమోషనల్ ఈవెంట్లో బన్నీ వాస్ కి ‘తండేల్’ కలెక్షన్స్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది..! ఓ రిపోర్టర్.. ‘తండేల్’ కి థియేటర్ మీద ఏ మేరకు లాభాలు వచ్చాయి సార్. ఎందుకంటే దానిపై ఒక కాంట్రోవర్సీ ఉంది. అదేంటంటే.. మీరు వేసిన రూ.100 కోట్ల పోస్టర్లో నిజం లేదు.
రూ.70 కోట్లు వస్తే.. మరో రూ.30 కోట్లు హైప్ చేశారు? అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిజమేనా?’ అంటూ ప్రశ్నించాడు. అందుకు బన్నీ వాస్ (Bunny Vasu) మాట్లాడుతూ.. “నాకు పంపే ఐటీ నోటీసులకు అన్నీ మీరు కట్టేస్తాను అంటే నేను స్టేజిపై ఓపెన్ గా చెప్పేస్తాను. సోషల్ మీడియాలో ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. నేను చెప్పేది నేను చెబుతాను” అంటూ సమాధానం ఇచ్చాడు. కానీ రూ.100 కోట్ల పోస్టర్లో నిజం ఉందా? లేదా? అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
‘తండేల్’ పై లాభాలు వచ్చాయా.. రూ.100 కోట్లు నిజమేనా?#BunnyVas #Thandel #NagaChaitanya #SaiPallavi pic.twitter.com/KBq8FI8ySj
— Filmy Focus (@FilmyFocus) March 3, 2025