Anshu: హీరోయిన్ అన్షు సినిమాలకు గుడ్ బై చెప్పడానికి అసలు కారణాలివే!

తెలుగు, తమిళ భాషల్లో తక్కువ సినిమాలే చేసినా అందం, అభినయంతో అభిమానులను ఆకట్టుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో అన్షు అంబానీ ఒకరు. రాఘవేంద్ర, మన్మథుడు సినిమాలలో తన క్యూట్ లుక్స్ తో మెప్పించిన ఈ బ్యూటీ దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. నిఖిల్ విజయేంద్ర సింహ యూట్యూబ్ ఛానల్ కు అన్షు అంబానీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అన్షు సినిమాలకు దూరం కావడం గురించి, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నేను ఇంగ్లాండ్ లో పుట్టి పెరిగానని నా పూర్వీకులు భారతీయులేనని ఆమె కామెంట్లు చేశారు. 16 సంవత్సరాల వయస్సులో నేను ఇండియాకు వచ్చానని ఆ సమయంలోనే మన్మథుడు సినిమాలో ఆఫర్ వచ్చిందని అన్షు వెల్లడించారు. ఒకవైపు సినిమాలలో యాక్టివ్ గా ఉండాలని భావించినా మరోవైపు చదువుపై దృష్టి పెట్టానని ఆమె కామెంట్లు చేశారు. మన్మథుడు, రాఘవేంద్ర సినిమాలలో నాకు సెకండ్ హీరోయిన్ రోల్స్ వచ్చాయని అన్షు చెప్పుకొచ్చారు.

ఈ రెండు సినిమాలలో నా పాత్ర చనిపోతుందని తర్వాత కొన్ని సినిమాలలో ఛాన్స్ వచ్చినా చనిపోయే రోల్స్ రావడంతో ఒకే తరహా పాత్రల్లో నటించకూడదని భావించానని ఆమె తెలిపారు. ఈ కారణాల వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యానని అన్షు అంబానీ కామెంట్లు చేశారు. ఒక పాత్ర బాగా చేశానని పదేపదే అదే తరహా పాత్రలు ఇవ్వడం కరెక్ట్ కాదని ఆమె తెలిపారు.

ప్రస్తుతం (Anshu) అన్షు అంబానీ లండన్ లో తన ఫ్యామిలీతో కలిసి స్థిరపడ్డారని తెలుస్తోంది. అన్షు దంపతులకు ఒక కూతురు ఉంది. వయస్సు పెరుగుతున్నా అన్షు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్షు అంబానీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతుండగా పాత్ర మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags