Dhanush: హీరో ధనుష్ పై నిషేధం విధించడానికి రీజన్లు ఇవేనా?

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న హీరోలలో ధనుష్ ఒకరనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది సార్ సినిమాతో ధనుష్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించింది. తెలుగులో కూడా సినిమా సినిమాకు ధనుష్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే కోలీవుడ్ హీరో ధనుష్ కు భారీ షాక్ తగిలిందని సమాచారం అందుతోంది.

తమిళ నిర్మాతల మండలి ధనుష్ కు రెడ్ కార్డ్ ఇవ్వనుందని తెలుస్తోంది. ధనుష్ తర్వాత సినిమాలపై బ్యాన్ విధించనున్నారని భోగట్టా. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ధనుష్ బిజీగా ఉండగా ధనుష్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. శ్రీ తేండ్రళ్ ఫిల్మ్స్ నుంచి ధనుష్ చాలా కాలం క్రితం అడ్వాన్స్ తీసుకున్నాడు. అయితే నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ధనుష్ మాత్రం ఆ బ్యానర్ లో సినిమా చేయడం లేదు.

ధనుష్ (Dhanush) ప్రవర్తనతో విసుగు చెందిన ఆ బ్యానర్ నిర్మాతలు తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించి ధనుష్ కు రెడ్ కార్డ్ ఇవ్వాలని కోరారు. ధనుష్ తో పాటు మరి కొందరు నటులకు కూడా నిర్మాతల మండలి రెడ్ కార్డ్ ఇవ్వనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. రెడ్ కార్డ్ ను జారీ చేస్తే దర్శకనిర్మాతలు ఈ హీరోలతో సినిమాలు చేయలేరు. ధనుష్ సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రెడ్ కార్డ్ ఇస్తే ధనుష్ నటించిన సినిమాలు విడుదల కావని బోగట్టా. ధనుష్ ఈ సమస్యలను వేగంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో కూడా కొంతమంది హీరోలు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus