Devara: దేవర సీక్వెల్ ఆలస్యం కావడానికి అసలు లెక్కలివేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర మూవీ 2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానుండగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా మేకర్స్ మాత్రం ఆ ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు. అయితే దేవర సినిమా అనుకున్న సమయానికే విడుదలైనా దేవర సీక్వెల్ మాత్రం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

దేవర1 రిలీజ్ తర్వాత తారక్ వార్2 సినిమాలో నటించాల్సి ఉంది. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ 3 నుంచి 4 నెలల సమయం కేటాయించనున్నారని తెలుస్తోంది. మరోవైపు వార్2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. దేవర సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఈ సినిమా షూట్ వేగంగా మొదలయ్యే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది.

దేవర సీక్వెల్ వేరే లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా దేవర సీక్వెల్ బడ్జెట్ మరింత పెరగనుందని సమాచారం అందుతోంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ కు చిన్న సర్జరీ జరిగిందని మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని సమాచారం అందుతోంది.

దేవర (Devara) సీక్వెల్ కు సంబంధించి త్వరలో మరిన్ని ఆసక్తికర అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం ఒకింత స్పెషల్ గా ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమా ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేసే మూవీ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివ ఈ సినిమాతో కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus