Fahadh Faasil: ఫహద్ ఫాజిల్ సైలెన్స్ వెనుక అసలు కారణమిదే!

బన్నీ హీరోగా నటించిన పుష్ప ది రైజ్ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో సక్సెస్ ను పుష్ప ది రైజ్ కంటిన్యూ చేసింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ఫహద్ ఫాజిల్ నటించిన సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ లో ఫహద్ ఫాజిల్ పాత్ర పరిమితం కాగా పుష్ప ది రూల్ లో ఫహద్ ఫాజిల్ ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారు.

అయితే పుష్ప ప్రమోషన్లలో ఫహద్ ఫాజిల్ ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా సినిమా ఈవెంట్లకు హాజరు కావడానికి ఫహద్ ఫాజిల్ ఎక్కువగా ఇష్టపడరు. ఒకవేళ ఈవెంట్లకు హాజరైనా ఫహద్ ఫాజిల్ ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తారు. మరోవైపు పుష్ప ది రైజ్ లో ఫహద్ ఫాజిల్ పాత్ర పరిమితం కావడంతో మేకర్స్ ఫహద్ ఫాజిల్ ను ప్రమోషన్స్ కు పిలవలేదని సమాచారం. పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు.

పుష్ప పార్ట్2 సమయంలో ఫహద్ ఫాజిల్ తో ప్రమోషన్స్ చేయించాలని మేకర్స్ భావిస్తున్నారు. పుష్ప సక్సెస్ తో ఫహద్ ఫాజిల్ కు తెలుగులో మరిన్ని సినిమా ఆఫర్లు వస్తాయెమో చూడాల్సి ఉంది. పుష్పరాజ్ పాత్రకు చుక్కలు చూపించే రోల్ లో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. పుష్ప సినిమా కోసం ఫహద్ ఫాజిల్ రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకున్నారు. ఫహద్ ఫాజిల్ మలయాళంలో స్టార్ హీరో కాగా ఫహద్ వల్ల మలయాళంలో పుష్ప ది రైజ్ కు కలెక్షన్లు మరింత పెరిగాయి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పుష్ప సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. పుష్ప సక్సెస్ తో బాలీవుడ్ లో బన్నీకి, సుకుమార్ కు క్రేజ్ పెరిగింది. పుష్ప పార్ట్2కు ఇతర భాషల్లో మంచి బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus