Game Changer: గేమ్ ఛేంజర్ మేకర్స్ సైలెన్స్ వెనుక అసలు రీజన్లు ఇవేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు కాగా తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో దిల్ రాజు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమాను సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తామని దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా వినాయక చవితి పండుగ కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీపావళి పండుగ సమయంలోనే ఈ సినిమా నుంచి జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగినా ఇప్పటివరకు ఆ సాంగ్ రిలీజ్ కాలేదు.

అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ కు చాలా సమయం ఉండటంతో ప్రమోషన్స్ ఆలస్యమవుతున్నాయని తెలుస్తోంది. ఇండియన్2 మూవీ విడుదలైతే మాత్రమే గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ రిజల్ట్ విషయంలో దిల్ రాజు, చరణ్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం అందుతోంది. థమన్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ ఇతర భాషల్లో సైతం విడుదల కానుందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ మూవీ దాదాపుగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. కియారా అద్వానీకి కూడా తెలుగులో భారీ సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆచార్య తర్వాత చరణ్ (Game Changer) నటించి విడుదల కానున్న సినిమా ఇదే కావడం గమనార్హం. చరణ్ ఈ సినిమాకు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. చరణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus