Kantara: అఖండ, కాంతార సక్సెస్ వెనుక రీజన్ ఇదే!

టాలీవుడ్ ప్రేక్షకులు కొత్తదనంతో తెరకెక్కిన సినిమాలను ఆదరిస్తారనే సంగతి తెలిసిందే. డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ కంటెంట్ బాగుంటే సినిమాలు సక్సెస్ సాధిస్తాయని ఈ ఏడాది విడుదలైన కేజీఎఫ్2 ప్రూవ్ చేసింది. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా సక్సెస్ తో కన్నడ సినిమా రేంజ్ మరింత పెరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాంతార సినిమా కూడా అంచనాలకు మించి పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కేజీఎఫ్2 రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని చెప్పలేం కానీ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్ లో ఈ సినిమా 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించే సాధించే ఛాన్స్ ఉంది. ఈ సినిమా సక్సెస్ తో రిషబ్ శెట్టి దర్శకుడిగా, నటుడిగా మంచి మార్కులు వేయించుకున్నారు. కాంతార సినిమా సక్సెస్ సాధించి కన్నడ సినిమా ఖ్యాతిని మరింత పెంచింది. దైవత్వంతో కూడిన కథలను ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయని ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి.

కాంతార సినిమాకు ఈరోజు బుకింగ్స్ కూడా బాగున్నాయి. తక్కువ మొత్తానికే ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిన గీతా ఆర్ట్స్ కు ఈ సినిమాతో భారీ లాభాలు ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రసుత్తం కాంతార సినిమా హవా నడుస్తోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుండటం గమనార్హం.

ఈ మధ్య కాలంలో నార్త్ ఇండియాలో నార్త్ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు. అదే సమయంలో సౌత్ సినిమాలు మాత్రం నార్త్ ఇండియాలో అంచనాలకు మించి సక్సెస్ అవుతున్నాయి. కాంతార హిందీలో కూడా ఊహించని రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus