Taraka Ratna: ఆ కారణాల వల్లే తారకరత్న స్టార్ కాలేకపోయారా?

నందమూరి హీరో తారకరత్న బ్యాగ్రౌండ్ ఉన్నా స్టార్ హీరో కాలేకపోయారు. సరైన కథలను, సరైన డైరెక్టర్లను ఎంచుకోలేకపోవడం తారకరత్నకు మైనస్ అయిందని చాలామంది భావిస్తారు. తారకరత్నకు లక్ కూడా కలిసిరాలేదని చాలామంది భావిస్తారు. ఒకటో నంబర్ కుర్రాడు మూవీ తారకరత్న తొలి సినిమా కాగా ఈ సినిమా కమర్షియల్ గా మంచి ఫలితాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత హీరోగా తారకరత్నకు ఈ స్థాయి విజయం దక్కలేదు.

నందమూరి హీరోల సినిమాలలో నటించి ఉంటే తారకరత్న స్థాయి మరింత పెరిగేదని తారకరత్న వేర్వేరు కారణాల వల్ల ఆ విధంగా చేయలేదని బోగట్టా. హీరోగా సక్సెస్ కాలేకపోయినా నటుడిగా తారకరత్న సక్సెస్ అయ్యారు. తారకరత్న అమరావతి, రాజా చెయ్యి వేస్తే సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు. తారకరత్నకు నటుడిగా పలు అవార్డులు సైతం వచ్చాయి.

తారకరత్న నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కొన్ని రోల్స్ లో తారకరత్న కాకుండా మరెవరు నటించినా ఆ సినిమాలు ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యేవి కావని కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. చాలామంది దర్శకులు సైతం తారకరత్న మంచి ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ అని చెబుతారు. తారకరత్నను ఇండస్ట్రీ కరెక్ట్ గా వాడుకుని ఉంటే బాగుండేది.

స్టార్స్ సినిమాలలో విలన్ గా ఛాన్స్ వచ్చి ఉంటే తారకరత్న రేంజ్ మారిపోయి ఉండేది. తారకరత్న మరణవార్త కుటుంబ సభ్యులను సైతం ఎంతగానో బాధ పెట్టింది. తారకరత్న భార్య, కూతురు వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారకరత్న మరణం ఎంతో బాధ పెట్టిందని చెబుతూ చాలామంది సినీ ప్రముఖులు కామెంట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus