స్టార్ స్టేటస్ ను అందుకున్న ప్రతి సెలబ్రిటీ ఆ స్టేటస్ ను సొంతం చేసుకోవడం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల గురించి చెప్పుకోవడానికి కొంతమంది ఇష్టపడితే మరి కొందరు సెలబ్రిటీలు మాత్రం ఆ కన్నీటి కష్టాల గురించి చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. అయితే ప్రస్తుతం 25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న నాని ఒక సందర్భంలో తనకు ఎదురైన కన్నీటి కష్టాల గురించి చెప్పుకొచ్చారు. డైరెక్టర్లకు మనం ఏదో ఒక రకంగా కనిపిస్తూ ఉంటే మాత్రమే వాళ్లు మనల్ని మరిచిపోరని నేను భావించేవాడినని నాని తెలిపారు.
అందుకు ఏం చేయాలా అని ఆలోచించి రోజూ ఉదయం 9 గంటల లోపు బాపు గారి ఆఫీస్ దగ్గరకు వెళ్లేవాడినని నాని చెప్పుకొచ్చారు. బయట ఉండే కుర్చీలో కూర్చుని ఎప్పుడు ఎవరు వస్తారా అని ఎదురుచూసేవాడినని ఆయన కామెంట్లు చేశారు. కొన్నిసార్లు రాత్రి 7 గంటల వరకు కూడా వేచి చూసిన సందర్భాలు ఉన్నాయని నాని తెలిపారు. ఆ సమయంలో నాకు కొంచెం పొట్ట ఉండేదని ఆ విధంగా వేచి ఉండటం వల్ల ఆ పొట్ట మొత్తం పోయిందని నాని చెప్పుకొచ్చారు.
సాధారణంగా లంచ్ సమయంలో అందరూ బయటకు వస్తారని ఆ సమయంలో నేను బయటకు వెళ్తే ఎవరికీ కనపడనని నాని అన్నారు. ఈ కారణం వల్ల ఏడాదిన్నర పాటు మధ్యాహ్న భోజనానికి దూరంగా ఉన్నానని ఆయన కామెంట్లు చేశారు. నేను వదిలేలా లేనని రాధా గోపాళం సినిమాకు క్లాప్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చారని నాని పేర్కొన్నారు. అది నాకు దక్కిన లక్ అని నాని వెల్లడించారు.
బాపుగారి స్కూల్ నుంచి కెరీర్ ను మొదలుపెట్టాననే భావనను ఎప్పటికీ మరిచిపోనని (Nani) నాని తెలిపారు. నాని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కెరీర్ విషయంలో నాని జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.