బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ తిట్టుకోవడం అనేది చాలా సహజం. ఇందులో భాగంగానే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వారి చేసిన తప్పులని ఎత్తిచూపుతూ మరీ తిట్టుకుంటారు. ముఖ్యంగా నామినేషన్స్ అప్పుడు ఒక రేంజ్ లో అరుచుకుంటారు. శ్రీసత్య -కీర్తి విషయంలో కూడా ఇదే జరిగింది. గత 10వారాలుగా చక్కగా కలిసి ఉన్న వీళ్లిద్దరికీ ఇప్పుడు గట్టిగా పడింది. నామినేషన్స్ లో శ్రీసత్య – కీర్తి ఒకరినొకరు నామినేట్ చేస్కున్నారు. దీంతో ఇద్దరి మద్యనా మాటల యుద్ధం జరిగింది. కీర్తి శ్రీసత్యకి ఈగో ట్యాగ్ ఇచ్చిందని శ్రీసత్య నామినేట్ చేసింది.
దీనికి క్లారిఫికేషన్ ఇస్తూ కీర్తి తిరిగి నామినేట్ చేసింది. ఇక్కడే ఇద్దరికీ గొడవ అయ్యింది. నామినేషన్స్ తర్వాత ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్నారు. నువ్వు గుడ్డు తీస్కుంటూ వెళ్లిపోతున్నప్పుడు నేను పిలిచినా పట్టించుకోలేదని చెప్తే, నువ్వు కూడా చాలాసార్లు అలాగే చేస్తావ్ అంతమాత్రనా నేను ఫీల్ అయ్యానా అంటూ శ్రీసత్య చెప్పింది. ఇక్కడే నేను శ్రీహాన్ మాట్లాడుకునేటపుడు , కుక్కలు అరిస్తే దేవలోకం పాడవ్వదు అని నా గురించే చెప్పావ్ అని నిలదీసింది. దీంతో నీ గురించి కాదని, అది జనరల్ గా చెప్పిన సామెత అని కీర్తి వాదించింది.
అలా అని నువ్వు నిరూపిస్తే నీ కాళ్లు పట్టుకుని హౌస్ నుంచీ వెళ్లిపోతా అని క్లారిటీ ఇచ్చింది. ఇది వరకటి కీర్తి అస్సలు కనిపించడం లేదని సత్య రెచ్చగొట్టింది. నాకు కూడా శ్రీసత్య కనిపించడం లేదని కీర్తి కౌంటర్ వేసింది. దీంతో కీర్తిని ఇమిటేట్ చేస్తూ , వచ్చిన కొత్తలో ఇంతలా ఉండేదానివి ఇప్పుడు ఆ కీర్తి ఏమైంది అంటూ శ్రీసత్య రెచ్చిపోయింది. దీంతో కీర్తికి ఒళ్లు మండింది. నీ నుంచీ ఆ వెటకారం ఎక్స్ పెక్ట్ చేయలేదని, వెక్కిరించినట్లుగా చేశావ్ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయింది. చాలాసేపు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.
కీర్తి ఈవిషయాన్ని ఇనాయకి, అలాగే మెరీనాకి చెప్పుకుంది. దీంతో శ్రీసత్య నైట్ బెడ్ దగ్గరకి వచ్చి నిన్ను ఇమిటేట్ చేసినందుకు సారీ అంటూ చెప్పింది. దీంతో వీళ్లిద్దరి మద్యలో గొడవ కాస్త చల్లబడింది. అయితే, ఇక్కడ శ్రీసత్య శ్రీహాన్ తో ఎప్పుడైతే ఉంటోందో అప్పుడు కీర్తి చేసిన తప్పులని ఎత్తి చూపడం అవుతోంది. చిన్న చిన్న పాయింట్స్ ని కూడా తీస్కుని వచ్చి నామినేట్ చేస్తోంది. కేవలం శ్రీహాన్ తో ఉండటం వల్లే కీర్తికి విరోధి అయ్యిందా ? అసలు రహస్యం ఇదేనా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీరిద్దరి గొడవకి ఎలా శుభం కార్డ్ పడుతుందనేది చూడాలి.