Naga Vamsi: అన్ని వేళ్ళు నాగవంశీ వైపే చూపిస్తున్నాయి..!

టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలు మూడే మూడు. ఒకటి ‘మైత్రి మూవీ మేకర్స్’ ఇంకోటి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’.. మరొకటి ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’. థియేటర్లకు ఎక్కువ ఫీడింగ్ ఇస్తుంది ఈ సంస్థలే అనడంలో కూడా సందేహం లేదు. అయితే సక్సెస్ రేట్ ఎక్కువ కలిగిన సంస్థ అంటే కచ్చితంగా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అనే చెప్పాలి. ఈ బ్యానర్లో ఎక్కువగా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే రూపొందుతాయి. అయినప్పటికీ ఎక్కువ శాతం హిట్లు ఉన్నాయి. దీంతో ‘సితార..’ అధినేత నాగవంశీ స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా ఒకప్పటి దిల్ రాజు హోదాని అనుభవిస్తున్నారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్లో కూడా నాగవంశీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వినికిడి.

Naga Vamsi

అయితే నాగవంశీతో ఓ మేజర్ కంప్లైంట్ ఉంది. అదేంటంటే.. అతని సినిమాలు అనుకున్న టైంకి, అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ కావు. బడ్జెట్ సంగతి ప్రేక్షకులకు, అభిమానులకు అనవసరం. కానీ అనుకున్న టైంకి రిలీజ్ కాకపోతే ఆ సినిమాల హీరోల ఫ్యాన్స్ నాగవంశీపై విమర్శల వర్షం కురిపిస్తూ వస్తారు. అన్ని సినిమాల సంగతి ఎలా ఉన్నా..’మాస్ జాతర’ విషయంలో మాత్రం నాగవంశీ ప్లానింగ్ అంతా తప్పే అని ఇండస్ట్రీ జనాలు కూడా మాట్లాడుతున్నారు. ఈ సినిమాని చాలా సార్లు వాయిదా వేశారు నాగవంశీ. 2025 సంక్రాంతి అన్నారు తర్వాత సమ్మర్ అన్నారు, ఫైనల్ గా ఆగస్టు 27 వినాయక చవితికి అన్నారు. కానీ చివరాఖరికి అక్టోబర్ 31 అన్ సీజన్ టైంలో రిలీజ్ అయ్యింది.

‘బాహుబలి – ఎపిక్’ దెబ్బకి రావాల్సిన వసూళ్లు కూడా రాలేదు. సినిమా బి,సి సెంటర్స్ కి నచ్చేదే. కానీ బ్యాడ్ రిలీజ్ టైం. ఇదే సినిమా వినాయక్ చవితి కానుకగా ఆగస్టు 27నే రిలీజ్ అయ్యి ఉంటే.. కచ్చితంగా కమర్షియల్ గా గట్టేక్కేది. టార్గెటెడ్ ఆడియన్స్ ని కూడా మెప్పించే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినట్టే చాలా మందికి తెలీదు అంటే ప్రమోషన్స్ లోపమే కదా. రవితేజ కెరీర్లో ఇది 75వ సినిమా. అంటే ల్యాండ్ మార్క్ మూవీ. పెద్ద హీరో ల్యాండ్ మార్క్ మూవీ విషయంలో నిర్మాత నాగవంశీ అశ్రద్ధ.. చాలా డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. అందుకే రవితేజ అభిమానులు అతన్ని పెద్ద ఎత్తున తిట్టిపోస్తున్నారు.

5వ రోజు కూడా అదరగొట్టిన ‘బాహుబలి- ది ఎపిక్’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus