NTR, Mahesh: ఈ ఇద్దరు హీరోలకు సినిమా కష్టాలు తీరతాయా?

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ, ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలకు సంబంధించిన ప్రకటనలు గతేడాది ఏప్రిల్ లో వెలువడ్డాయి. ఈ ఏడాది జూన్ లేదా జులై నుంచి ఈ సినిమాల రెగ్యులర్ షూటింగ్ లు మొదలవుతాయని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించి వేర్వేరు సమస్యలు రావడంతో ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమాకు సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు మొదలు కాగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత రావాల్సి ఉంది.

ఈ ఇద్దరు హీరోలకు సినిమా కష్టాలు తీరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు వేర్వేరుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. ఎన్టీఆర్, మహేష్ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి స్పష్టత లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ తర్వాత ప్రాజెక్ట్ లతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ యువసుధ క్రియేషన్స్,

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండటం గమనార్హం. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తారక్ కొరటాల కాంబో మూవీలో హీరోయిన్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం తారక్ వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. తారక్ వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

మహేష్, తారక్ వేర్వేరుగా 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది ఈ ఇద్దరు హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయేమో చూడాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus