గత ఏడాది ఆచార్య, బీస్ట్, బీమ్లానాయక్, లైగర్, విక్రమ్ కోబ్రా, పొన్నియన్ సెల్వన్-1 ఇలాంటి పెద్ద సినిమాలు మరియు చిన్న సినిమాలు కలిసి గత ఏడాది దాదాపు 50పైగా సినిమాలు టాలీవుడ్ లో రీలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు ప్రేక్షకులను థియేటర్స్ తీసుకురాలేకపోయాయి.. సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు ప్రేక్షకులు థియేటర్స్ ఎందుకు రాలేదని ఆలోనలో పడ్డారు.. దానికి ప్రేక్షకులు మమ్మల్ని థియేటర్స్ కు రప్పించే సినిమాలు తీస్తేనే వస్తామంటూ ఆడియన్స్ ఓ చాలెంజ్ విసిరారు.
ఆ సవాల్ కు జవాబే ‘విరూపాక్ష” అని హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) అన్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు బి.సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా గత శుక్రవారం (ఏప్రిల్ 21) విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. “విరూపాక్ష’ విజయం నాదో, మా టీమ్ కాదు..
మన ప్రేక్షకులది. మన ఇండస్ట్రీకి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తీసుకెళ్లటానికి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు. “విరూపాక్ష’ని హిట్ చేసిన ఆడియన్స్ కు థ్యాంక్స్” అన్నారు కార్తీక్ దండు. “ఈ మూవీలో నా పాత్రకి వస్తున్న స్పందనకు కారణం కార్తీక్రే” అన్నారు సంయుక్తా మీనన్. “ఈ సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్” అన్నారు డైరెక్టర్ మారుతి. “విరూపాక్ష’ని అందరూ థియేటర్లోనే చూడండి..
గొప్ప అనుభూతి వస్తుంది” అన్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్, కెమెరామేన్ శ్యామ్ దత్, నటీనటులు సోనియా సింగ్, సాయిచంద్, అజయ్, కమల్ కామరాజు బ్రహ్మాజీ, రవికృష్ణ పాల్గొన్నారు. ఇటీవల రిలీజ్ అయిన బలగం, దసరా వంటి సినిమాలు కూడా విజయాలు సాధించి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయని సినీ రంగం భావిస్తోంది అనుకుంటున్నారు.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?