ఆ రీజన్ వల్లే శాకుంతలం మూవీలో తారక్ కొడుకు నటించలేదా?

సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన శాకుంతలం మూవీ సమంత ఫ్యాన్స్ ను సైతం ఆకట్టుకోలేదు. ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా శాకుంతలం సినిమాను తెరకెక్కించే విషయంలో గుణశేఖర్ తడబడ్డారు. దిల్ రాజు లాంటి అనుభవం ఉన్న నిర్మాత సైతం ఈ సినిమా రిజల్ట్ ను ముందుగానే అంచనా వేయలేకపోయారు. ఈ సినిమాలో భరతుని రోల్ లో అల్లు అర్హ తన అద్భుతమైన అభినయంతో మెప్పించారు. అయితే ఈ సినిమా కోసం మొదట జూనియర్ ఎన్టీఆర్ కొడుకును గుణశేఖర్ భరతుని పాత్ర కోసం తీసుకోవాలని అనుకున్నారట.

అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన కొడుకును ఈ సినిమా ద్వారా పరిచయం చేయడానికి అస్సలు ఇష్టపడలేదని సమాచారం. అభయ్ రామ్ ఈ పాత్ర పోషించే అవకాశాన్ని అలా మిస్ చేసుకున్నాడని సమాచారం అందుతోంది. ఒకవేళ అభయ్ రామ్ నటించి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ తన కొడుకులను సినిమాల్లో ఇప్పుడే పరిచయం చేయాలని అనుకోవడం లేదు.

మరికొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే అభయ్ రామ్, భార్గవ్ రామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తారక్ కొరటాల శివ కాంబో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఒకవైపు కొరటాల శివ సినిమాలో నటిస్తూనే మరోవైపు వార్2 సినిమాలో తారక్ నటించనున్నారు.

ఈ ఏడాదే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. తారక్ వరుస షూటింగ్ లతో బిజీ కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటించనున్నారని తెలుస్తోంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus