ఆ బాలీవుడ్ మూవీ వల్ల టాలీవుడ్లో క్రేజీ మల్టీ స్టారర్ మిస్ అయ్యిందట..!

టాలీవుడ్లో ప్రభాస్,గోపీచంద్ లు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఆరడుగుల పైనే హైట్ ఉంటారు.గతంలో వీరిద్దరూ వర్షం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా అతన్ని ఢీ కొట్టే విలన్ గా గోపీచంద్ నటించాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది.అటు తరువాత గోపి కూడా హీరోగా మారి సక్సెస్ అయ్యాడు. గోలిమర్ సినిమా టైంలో ప్రభాస్ కంటే ఒకడుగు ముందే ఉన్నాడు గోపీచంద్.

దాంతో వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వస్టే చూడాలని ప్రేక్షకులు ఆశించారు. ప్రభాస్ కూడా ఓ ఇంటర్వ్యూలో మల్టీ స్టారర్ అంటూ చేస్తే గోపీచంద్ తో చెయ్యాలని ఉంది అంటూ తెలిపాడు. దాంతో మరింతగా ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. అయితే వీళ్లిద్దరినీ పెట్టి ఓ మల్టీ స్టారర్ తియ్యాలని ఓ దర్శకుడు ప్లాన్ చేశాడట. అతనే పూరి జగన్నాథ్. వీళ్ళిద్దరికీ అతనితో మంచి స్నేహం ఉంది. పైగా అప్పటికే ఇద్దరితోనూ సినిమాలు కూడా చేశాడు.

షోలే ఇన్స్పిరేషన్ తో ఓ మల్టీ స్టారర్ కథని ప్లాన్ చేసాడు పూరి. ఆ హీరోలకు కూడా ఇది వినిపించాడు. కానీ ఆ టైంలో పూరి.. అమితాబ్ తో బుడ్డా హోగా తెర బాప్ అనే బాలీవుడ్ సినిమా చేస్తూ బిజీగా ఉండడం.. ఆ తరువాత అతను బిజినెస్మెన్, కెమెరామెన్ గంగ తో రాంబాబు వంటి సినిమాలతో బిజీ అయిపోవడంతో ఈ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్ళలేదు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus