Manchu Vishnu: ఇండస్ట్రీ సమస్యల గురించి ఎవరు ఏం చేశారు చూశారా..!

టాలీవుడ్‌ గురించి ఒకటి కాదు, రెండు కాదు చాలా మెట్లు దిగి ఏకంగా సీఎం జగన్‌ను చేతులు జోడించి మరీ సాయం అడిగారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆ వీడియో ఒకవైపు వైరల్ అవుతోంది. మరోవైపు ఇండస్ట్రీ సమస్యల గురించి మంత్రి పేర్ని నాని మాకు వివరించారు అంటూ విష్ణు ట్వీట్‌ చేసి డిలీట్‌ చేశారనే విషయం కూడా వైరల్‌ అవుతోంది. నిజానికి రెండూ వేర్వేరు. కానీ పరిశ్రమ గురించి ఎవరు ఏం చేశారు అనేది వీటితో తెలుస్తోంది.

Click Here To Watch

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చాలా రోజులుగా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నాం, చేశాం అని చెబుతున్నారు. ఒకరిద్దరు ప్రభుత్వంతో మాట్లాడినా… సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి పావులు కదల్లేదు. కానీ ఇండస్ట్రీ పెద్ద కాని పెద్ద అయిన చిరంజీవి రెండు మీటింగ్స్‌లో పని ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఒక్కరిగా వెళ్లి సీఎం జగన్‌తో మాట్లాడి చర్చించారు. ఆయన ఒక్కరే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో పదే పదే ఫోన్లు చేసి మాట్లాడి చర్చించారు.

ఈ క్రమంలో మంత్రిని నొప్పించకుండా జాగ్రత్తగా మాట్లాడారు అని మంత్రి నానినే చెప్పారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోలు, స్టార్‌ దర్శకుల్ని తీసుకెళ్లి ఏపీ సీఎం జగన్‌తో మాట్లాడారు. పరిశ్రమ మేలు గురించి మీరు చేయండి, మీరు చెప్పింది మేం చేస్తాం అంటూ సీఎంతో చర్చించారు. ఈ క్రమంలో సీఎంగా మీరు పరిశ్రమ మేలు చేయండి అంటూ చేతులు జోడించి మరీ అడిగారు చిరంజీవి. ఈ విషయంలో అభిమానులకు, ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ తనను ఇంతవాడిని చేసిన పరిశ్రమ గురించి ఆ మాత్రం తగ్గడం తప్పు కాదు.

అయినా త్రివిక్రమ్‌ ఎప్పుడో డైలాగ్‌ రాసేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి అని. అలా తగ్గినోడు గొప్పోడు అని. ఆ పని ఇప్పుడు చిరంజీవి చూపించారు. దీంతో పరిశ్రమ మంచి కోసం చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు అనే మాట మరోసారి తేలింది. దీంతో బేరీజు వేస్తాం అని అనుకోకూడదు కానీ. పరిశ్రమ కోసం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏం చేశారు అంటే… ఓ ట్వీట్‌ చేసి డిలీట్‌ చేశారు అనొచ్చు.

ఏపీ మంత్రి పేర్ని నాని… సీనియర్‌ నటుడు మోహన్‌బాబును కలిశారు. హైదరాబాద్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడు వివాహానికి హాజరై… అటు నుండి అటు మోహన్‌బాబును కలవడానికి వెళ్లారు. అక్కడ చిన్నపాటి సత్కారం కూడా జరిగింది. శాలువా కప్పి సత్కరించారు కూడా. ఏం జరిగింది, ఎందుకు కలిశారు అనేది ఎవరికీ తెలియదు. అయితే కాసేపటి మంచు విష్ణు ట్వీట్‌ చేస్తూ… ‘‘సినిమా పెద్దలతో జరిగిన భేటీ వివరాలు మాకు చెప్పినందుకు థ్యాంక్స్‌’ అనే రీతిలో ట్వీట్‌ చేశారు.

అయితే ఏమైందో ఏమో కానీ కాసేపటికి ట్వీట్‌ డిలీట్‌ అయ్యింది. తన నివాసంలో నానిని సత్కరించడం ఆనందంగా ఉందని, టాలీవుడ్‌ ప్రయోజనాలను సంరక్షిస్తున్నందుకు ధన్యవాదాలు అని మార్చి ట్వీట్‌ చేశారు. పేర్ని నాని చెప్పడం వల్లే ట్వీట్‌ మారింది అని తర్వాత తెలిసింది. తాను మార్చమంటనే విష్ణు ట్వీట్‌ మార్చారని నాని చెప్పారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ ట్వీటు – డిలీట్‌ వ్యవహారం వైరల్‌గా మారింది. అసలు పేర్ని నాని – మోహన్‌బాబు భేటీలో జరిగిందేంటి? విష్ణు ఫస్ట్‌ ట్వీట్‌ చేసిందే జరిగిందా? లేక రెండోసారి ట్వీట్‌ చేసింది జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు ఇండస్ట్రీ నుండి సీఎం కలవడానికి వెళ్తున్న విషయం తనకు తెలియదని మోహన్‌బాబు చెప్పారని మంత్రి నాని అన్నారు. అయితే ప్రభుత్వం నుండి ఆహ్వానం అందినవాళ్లే వచ్చాం అని భేటీ రోజు చిరంజీవి చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం మరోసారి చిరంజీవి – మోహన్‌బాబు వ్యవహారంలా మారింది. ఏదేమైనా ఈ విషయం క్లారిటీ రావాల్సి ఉంది. ఎవరిస్తారో చూడాలి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags