Balakrishna, Jr NTR: హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్ – బాలయ్య అభిమానుల వార్..

నందమూరి బాలకృష్ణ – ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఇప్పుడు గొడవ జరుగుతుంది. అది కూడా ట్రోలింగ్ రూపంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. దీనికి కారణాలు చాలా వరకు అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు, జూనియర్ ఎన్టీఆర్ 40 వ పుట్టినరోజు వేడుకలు ఒకే రోజు వచ్చాయి. దీంతో బర్త్ డే రోజున..ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో బర్త్ డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకోవడంతో.. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ రాలేను అని తన టీం ద్వారా అనౌన్స్ చేశాడు.

అంతేకాదు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఏర్పాటు చేసిన టీంకి అయితే ఎన్టీఆర్ ముందుగానే చెప్పాడట. అయినప్పటికీ తన తాతగారి పేరు పై ఏర్పాటు చేసిన ఈ గొప్ప వేడుకకు ఎన్టీఆర్ వెళ్లకపోవడంతో నందమూరి అభిమానులు, బాలయ్య అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. ఈ క్రమంలో బాలయ్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అటు తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా యాక్టివ్ అయ్యి బాలయ్య ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

చినికి చినికి గాలి వాన అయినట్టు.. ఈ విషయం కాస్త చర్చనీయాంశం అయ్యింది. (Jr NTR) జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య ఏ వేడుకలో కనిపించినా ఎడమొఖం .. పెడమొఖం అన్నట్టే ఉంటున్నారు. రాజకీయాల పరంగా ఏర్పడిన కోల్డ్ వార్ దీనికి కారణమని అంతా చెప్పుకుంటున్నారు. మొన్నటికి మొన్న తారకరత్న అంత్యక్రియల్లో.. బాలయ్య – తారక్ లు ఒకరి మొహం ఇంకొకరు చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల మధ్య ఇలాంటి గొడవలు చోటు చేసుకోవడానికి అదే కారణమని చర్చించుకుంటున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్ – చరణ్, పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్, అల్లు అర్జున్ – చరణ్.. అభిమానుల మధ్య కూడా ఇలాంటి ట్రోలింగ్ చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే మెగా హీరోలు మాత్రం మేము మేము బాగానే ఉన్నాం అని చెప్పి.. అలాంటి ఫ్యాన్ వార్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. మరి బాలయ్య – ఎన్టీఆర్ లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus