బిగ్ బాస్ హౌస్ లో కి శ్రీసత్య ఫ్యామిలీ వచ్చిన తర్వాత హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ అందరూ కన్నీటి పర్యంతం అయ్యారు. అసలు శ్రీసత్య మదర్ కి ఏమైంది ? ఎందుకు వీల్ ఛైర్ ఎక్కిందనేది చాలామంది నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. నిజానికి శ్రీసత్య వల్లే ఆమెకి స్ట్రోక్ వచ్చిందని చాలాసార్లు బిగ్ బాస్ హౌస్ లో శ్రీసత్య చెప్పింది కూడా. గతంలో బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ అందరూ తమ జీవితంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకునేటపుడు ఈవిషయాన్ని ఆమె చెప్పింది.
తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందని, ఆ తర్వాత తనని కావాలనే వదిలేసి ఏవో కారణాలు చెప్పాడని చెప్పింది. అంతేకాదు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇద్దరికీ అస్సలు సెట్ అవ్వలేదని చెప్పింది. దీనికి అతనే కారణం అని చాలా స్ఫష్టంగా చెప్పింది. దీంతో ఆమె ఒకసారి సూసైడ్ అటెమ్ట్ చేసిందని అప్పుడు వాళ్ల అమ్మకి స్ట్రోక్ వచ్చిందని శ్రీసత్య తన స్టోరీలో చెప్పింది. నిజానికి నేను సూసైడ్ ప్రయత్నం చేయకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా మా అమ్మ ఇప్పుడు లేచి తిరిగి ఉండేదని,
కేవలం నా తొందరపాటు వల్లే ఆమెకి ఇలా అయ్యిందని ఏడుస్తూ చెప్తూ బాధపడింది. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ లో ఒకసారి సుదీప, బాలాదిత్య, అర్జున్ కళ్యాణ్, సూర్యలతో కలిసి ఒక స్కిట్ కూడా చేసింది. ఇది హాట్ స్టార్ లైవ్ లో వచ్చింది కానీ, టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యేటపుడు ఈ స్కిట్ ని ప్రసారం చేయలేదు. దీంతో చాలామందికి అసలు ఏం జరిగిందనే కూడా తెలీదు.
శ్రీసత్య సూసైడ్ ప్రయత్నం చేసినపుడు స్ట్రోక్ వచ్చినపుడు వెంటనే హాస్పిటల్ కి తీస్కుని వెళ్లామని, కానీ డాక్టర్స్ ఆమె ఇది వరకటి లాగా తిరిగి నడవలేదని చెప్పారని చెప్పి వాపోయింది. కేవలం తన వల్లే ఇలా అవ్వడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని, ఇప్పుడు ఆమె ట్రీట్మెంట్ కోసం ఎంత దూరమైన వెళ్లి తగ్గించుకోవాలని ఉందని చెప్పింది. శ్రీసత్య వాళ్ల మదర్ ని చూసి ఇప్పుడు ఆడియన్స్ ఆమెపై సింపతీని చూపిస్తున్నారు.
గతంలో శ్రీసత్య చాలాసార్లు ఈవిషయాన్ని చెప్పిందని, కేవలం డబ్బుల కోసమే ఆట ఆడేందుకు వచ్చానని క్లియర్ గా చెప్పిందని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, ఈవారం శ్రీసత్య నామినేషన్స్ నుంచీ సేవ్ చేయాలని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈవారం దీనివల్ల శ్రీసత్య సేఫ్ అవుతుందా లేదా అనేది చూడాలి.