‘ఫిదా’ సాయిచంద్‌ జీవితంలో ఇంత జరిగిందా?

సాయిచంద్‌ అంటే… నేటి తరం సినిమా ప్రేక్షకులు అంత సులభంగా గుర్తుపట్టకపోవచ్చు. అదే ‘ఫిదా’ సాయిచంద్‌ అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. ‘ఫిదా’లో సాయిపల్లవి తండ్రిగా అదరగొట్టేశారు సాయిచంద్‌. చాలా ఏళ్ల తర్వాత ఆ సినిమా చేసి… ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలా అని ఏది పడితే అది చేయడం లేదు. ప్రతి సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. అంతలా సినిమా పట్ల అభిమానం చూపించే సాయిచంద్‌ పెళ్లి చేసుకోలేదు తెలుసా? దానికి కారణం ఇటీవల చెప్పుకొచ్చారాయన.

అమ్మ చనిపోయిన బాధ ఆయన్ను చాలా రోజులు వెన్నాడిందట. చిన్నప్పుడు ‘సతీ అరుంధతి’లో నటించారాయన. ఆ సమయంలో జమున గారిని చూసి ‘అమ్మా! నన్ను విడిచి వెళ్లి పోతున్నావా!’ అనే డైలాగ్‌ చెప్పాలట. ఆ సీన్‌ చెప్పేటప్పుడు ఉద్వేగానికి గురై ఆమె చేతులపైన పడి భోరుమన్నారట. ‘మంచుపల్లకి’లోనూ తల్లి లేకుండా తండ్రి పెంపకంలో పెరిగిన యువకుడి పాత్రే చేశారు సాయిచంద్‌. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో తండ్రిపైన కోపంతో బయటకొచ్చి బైకు మీద హీరోయిన్‌ సుహాసిని ఇంటిచుట్టూ రౌండ్స్‌ కొడుతూ ఉంటారాయన.

ఆ సీన్‌లో సుహాసిని వచ్చి ఆపి.. ఎందుకిలా చేస్తున్నావ్‌ అని అడిగితే… ‘అమ్మ గుర్తు కొస్తోంది’ అని చెప్పే సీన్‌ ఉంటుందట. ఆ సన్నివేశం షూట్‌ చేస్తున్నప్పుడు కూడా కన్నీళ్లు పెట్టేశారట సాయిచంద్‌. ఈ బాధని మరచి పోవాలని… ఎవరైనా మహిళలు ఆయన మీద ఆత్మీయత చూపిస్తే అమ్మా, అక్కా, చెల్లీ అంటూ వరసలు కలిపేస్తారట. మహిళల్ని అలా తప్ప మరోలా చూడలేకపోవడం వల్ల ఆయన పెళ్ళిచేసుకోలేదట!

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus