“జైబాలయ్య” విలువ ఎంతో తెలుసా??

  • July 29, 2016 / 08:24 AM IST

అవును బాలయ్య అంటే నినాదం కాదు, అది అశేష  తెలుగువారి గుండె చప్పుడు,  నందమూరి అభిమానులకు ఊపిరి. అయితే అలాంటి బాలయ్యపై ఏమైనా రాంగ్ న్యూస్ వస్తే బాలయ్య అభిమానులు తమ తఢాకా చూపించిన సంధర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే క్రమంలో ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలో బాలయ్యను వ్యంగ్యంగా అనుకరించాడని ఫేస్ బుక్, ట్విటర్ లలో ఆ హీరోకి శ్రద్డాంజలి ఘటించారు బాలయ్య అభిమానులు. ఆయన అంటే అంత అభిమానం వాళ్ళకి.

వాళ్ళకే కాదు, సినిమా పరిశ్రమలో కూడా బాలయ్య అంటే ఇష్టం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన నటన, ఆయన ఇచ్చే గౌరవం, ఆయన చూపించే ప్రేమ, అంతెందుకు ఆయన మాట్లాడే తీరు, అలా ప్రతీదీ బాలయ్య ను అభిమానించేలా చేస్తుంది. అదే క్రమంలో జై బాలయ్య అనం పదం ఒక స్టార్ కమీడీయన్ కు 20లక్షలు తెచ్చిపెట్టింది. అదేలా అంటే…ఒక ప్రముఖ ఛానల్ గేమ్ షో కి వచ్చిన 30 ఇయర్స్ పృథ్వి  బాలయ్యని పొగడ్తలతో ముంచెత్తాడు . సహజంగానే బాలయ్యకు వీరాభిమాని అయిన పృధ్వి  గేమ్  స్టార్ట్  అయ్యే ముందు  జై బాలయ్య  అంటూ అరిచి గేమ్ స్టార్ట్ చేశాడు.

ఇక్కడ ఇంకో ట్విష్ట్ ఏంటి అంటే…మీకు ఈ గేమ్ లో బాలయ్య గారు ఎంత డబ్బు తెచ్చి పెడతాడు అని అడుగగా  20 లక్షలు ఇస్తాడు అని తెలిపాడు. చివరకు పృథ్వి చెప్పినట్టు 20 లక్షలు బాలయ్య వల్ల రావటం జరిగింది. ఆది మొత్తానికి జై బాలయ్య అన్న పధం విలువ 20లక్షలు అన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus