Jai Balayya: ‘జై బాలయ్య’ స్లోగన్ వాయిస్ గురించి నందమూరి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..?

నటసింహ నందమూరి బాలకృష్ణ – యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల క్రేజీ కాంబోలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వీర సింహా రెడ్డి’.. శృతి హాసన్ హీరోయిన్.. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. జనవరి 6 సాయంత్రం ఒంగోలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది.. బాలయ్యతో ఇండస్ట్రీ హిట్స్ తీసిన సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు..

దీనికి ప్రేక్షకాభిమానుల నుండి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది.. ఇప్పటికే 5 మిలియన్లకు పైగా వ్యూస్, 300K కి పైగా లైక్స్‌తో ట్రెండ్ అవుతోంది ట్రైలర్.. ఇక ట్రైలర్‌లో మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించిన బాలయ్య యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగిపోయాడు.. మరోసారి తన డైలాగ్స్ డైనమెట్స్‌లా పేలబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.. ఇక ముఖ్యంగా.. ‘హూ ఆర్ యు?’ అనడిగితే.. ‘పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్లి నిలబడు.. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది’..

అనగా ‘జై బాలయ్య’ నినాదం వినిపించడం.. బాలయ్య.. ‘అదీ’ అనడం ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. అయితే ట్రైలర్‌లో ‘జై బాలయ్య’ స్లోగన్ వచ్చిన వాయిస్ గతంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిందేనంటూ నందమూరి అభిమానులు ఈ వీడియోనూ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లిలో తారక్ ‘జై బాలయ్య’ స్లోగన్ చెప్పిన సంగతి తెలిసిందే.. ఈ వాయిస్ కట్ చేసి ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్‌లో పెట్టారని..

రిపీట్ చేసి వింటే అర్థమవుతుందంటున్నారు ఫ్యాన్స్.. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మైత్రీ మూవీస్ వారి ఏవీలో ‘జనతా గ్యారేజ్’ లో తారక్ డ్యాన్స్ చూసి బాలయ్య ఆనందంగా ఫీలవుతున్న వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.. ‘జై బాలయ్య’.. ఈ స్లోగన్ నటసింహ నందమూరి అభిమానులకి ఆక్సిజన్ లాంటిది.. సినిమా రిలీజ్ అయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, టాక్ షో అయినా, మరే ఫంక్షన్ అయినా..

గల్లీలో అయినా, పబ్బుల్లోనైనా.. అమలాపురం టు అమెరికా వరకు.. విశ్వవ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులకు ఈ నాలుగక్షరాల పదమంటే ప్రాణం.. ‘జై బాలయ్య’ అనేది కేవలం స్లోగన్ మాత్రమే కాదు మా ఎమోషన్ అంటుంటారు ఫ్యాన్స్.. ‘వీర సింహా రెడ్డి’ బ్యానర్‌తో క్రికెట్ స్టేడియంలోనూ సందడి చేసిన సంగతి తెలిసిందే..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus