శాతవాహనుల రాజుల్లో గొప్పవాడు, తెలుగు వారు గర్వంగా చెప్పుకునే యుద్ధవీరుడు శాతకర్ణి గా నటసింహా నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించి అన్ని వర్గాల ప్రజల నుంచి అభినందనలు అందుకుంటున్నారు. అతి తక్కువకాలంలో డైరక్టర్ క్రిష్ ఈ మూవీని తెరకెక్కించి ప్రముఖ దర్శకులతో శెభాష్ అనిపించుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన గౌతమి పుత్ర శాతకర్ణి ఐదు రోజుల్లో వందకోట్ల గ్రాస్ వసూల్ చేసి రికార్డు సృష్టించింది. అందరినీ విశేషంగా అలరిస్తున్న ఈ మూవీ పై సినీ విశ్లేషకులు కొన్ని విమర్శలు గుప్పించారు. ప్రతి చిత్రంలోనూ కథకు ప్రాధాన్యత ఇచ్చే క్రిష్ ఈ సారి ఎమోషన్ సీన్స్, యాక్షన్ సీన్స్ తో గౌతమి పుత్ర శాతకర్ణి ని చుట్టేశారని ఆరోపించారు.
ప్రేక్షకుల్లో కొంతమంది ఇది నిజమేనని చెబుతున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం ఎటువంటి ఖండన ప్రకటన చేయలేదు. ఈ విమర్శపై హీరో బాలకృష్ణ స్పందించారు. విశ్లేషకుల మాటల్లో వాస్తవం ఉందని ఒప్పుకున్నారు. “అలనాటి మహానుభావుల గురించి మన దగ్గర పూర్తి సమాచారం లేదు. కానీ వారి గురించి తెలుసుకోవాలనే తపన ఎక్కువగా ఉంది. అందుకే పెద్దగా కథ లేకపోయినా గౌతమి పుత్ర శాతకర్ణి మూవీని చేసాము” అని అంగీకరించారు. దీంతో ఈ విషయం పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ సద్దుమణిగింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.