Om Raut: ‘ఆదిపురుష్’ … దర్శకుడు చేసిన ఈ పొరపాట్లను గమనించారా?

  • June 22, 2023 / 07:16 PM IST

‘ఆదిపురుష్’ గురించి వస్తున్న విమ‌ర్శ‌లు చూస్తూనే ఉన్నాం. వాల్మీకి రచించిన రామాయ‌ణానికి – ఓం రౌత్ తీసిన రామాయ‌ణానికీ చాలా తేడా ఉంద‌న్న‌ది అందరికీ తెలిసిన సంగతే. అత‌ను ప్రెజెంట్ జనరేషన్ కి రామాయణం యొక్క గొప్పతనాన్ని, రాముడిలో ఉన్న గొప్ప గుణాలని తెలియజెప్పాలని భావించి.. ప్రభాస్ వంటి పాన్ ఇండియా అప్పీల్ కలిగిన హీరోని ఎంపిక చేసుకున్నాడు. అది తెలివైన నిర్ణయమే కాదు గొప్ప నిర్ణయం కూడా..! దానికి అతన్ని మెచ్చుకోవచ్చు కూడా..! అయితే అసలు సమస్య ఎక్కడ వచ్చింది అంటే.. రామాయణం అనేది అప్ కమింగ్ జెనరేషన్ కి తెలిసుండకపోవచ్చు.. కానీ ఇప్పుడున్న 30 ,40 ఏజ్ గ్రూప్ వాళ్ళే చిన్నప్పటి నుండి 10 సార్లు పైనే చూశారు.

కాబట్టి ‘ఓం రౌత్’ (Om Raut)  తీసిన రామాయణాన్ని తప్పు పడుతున్నారు. నిజానికి అందులో కూడా ఎలాంటి తప్పు లేదు. కానీ పెద్ద బడ్జెట్ తో రామాయణం తీస్తున్నప్పుడు, దేశం మొత్తం మెచ్చిన ప్రభాస్ వంటి హీరో ఉన్నప్పుడు ‘రామాయణాన్ని’ చాలా శ్రద్ధతో చేయాలి. దర్శకుడు ఓం రౌత్ చేసిన పొరపాటు ఇదే. సినిమాలో ఇలాంటి పొరపాట్లు చాలానే కనిపించాయి. అందులో టాప్ 10 ఏంటో ఇప్పుడు చూద్దాం రండి :

1) రాముడు చూస్తుండగానే రావణాసురుడు.. సీతమ్మని అపహరించడం అనేది వాల్మీకి రచించిన రామాయణంలో లేదు. జటాయువు.. రావణాసురుడు చేతిలో రెక్కలు ముక్కలు చేయించుకుని రాముని వద్దకు వచ్చి.. అసలు విషయం చెప్పి ప్రాణం విడుస్తాడు. కానీ రాముడి కళ్ళ ముందే రావణాసురుడు .. సీతని ఎత్తుకుపోతున్నట్టు చూపించాడు దర్శకుడు ఓం రౌత్.

2) రాముడు, సీత లను ఔట్ ఫిట్స్ లో చూపించడం కూడా దర్శకుడు ఓం రౌత్ కే చెందింది.

3) రావణాసురుడు 10 తలలను సగం ముందు, సగం వెనుక పెట్టి చూపించిన ఘనత కూడా ఓం రౌత్ కే చెల్లింది. ఇక నుండీ ప్రతి దసరాకి రావణాసురుడు తలలను అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చన్న మాట.

4) రూ.400 కోట్ల బడ్జెట్ లో సినిమా తీసినప్పుడు సినిమా అంతా డార్క్ మోడ్ లో ఉండటం ఏంటనేది చాలా మంది ప్రశ్న.

5) శ్రీరాముడిగా కనిపించిన ప్రభాస్ సెకండ్ హాఫ్ లోని ఓ సన్నివేశంలో ఓ యాంగిల్ లో సన్నగా మరో యాంగిల్ లో లావుగా కనిపిస్తాడు. అలాగే ఓ సన్నివేశంలో అయితే జీసస్ లా కూడా కనిపిస్తాడు.

6) రాముడు,సీత, లక్ష్మణుడు, హనుమంతుడు.. వంటి పాత్రలని రాఘవ, జానకి, శేషు, భజరంగ్ అని చూపిస్తారు. కానీ సేతు కట్టే చోట రాళ్లపై రామ అని రాసి ఉంటుంది.

7) చివర్లో హనుమంతుడు .. కుంభకర్ణుడి చేతిలో తన్నులు తింటాడు. అలాంటి సన్నివేశం గతంలో ఎన్నడూ చూడండి అసలు లేనిది కూడా..!

8) మండోదరి, శూర్పణఖ వంటి వారి మొహం పై బొట్టు కూడా ఉండదు. ఇది ఇంకా విడ్డూరం.

9) రావణాసురుడు వాహనం గబ్బిలం అని చూపించాడు ఓం రౌత్.అది ఇంకా పెద్ద మిస్టేక్.

10) హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు.. అతన్ని లిఫ్ట్ లో రావణాసురుడి వద్దకి తీసుకెళ్లడం వంటిది కూడా ఓం రౌత్ ని విమర్శించేందుకు ఛాన్స్ ఇచ్చేసింది.

11) ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే.. రావణాసురుడు పాములతో మసాజ్ చేయించుకోవడం ఏంటో అర్ధం కాదు. అది కూడా పెద్ద మైనస్ అనే చెప్పాలి. అంతేకాదు ఏ సన్నివేశంలోనూ కూడా రావణాసురుడు నగలు పెట్టుకుని కనిపించడు.. బ్లాక్ టీ షర్ట్ వేసుకుని గడ్డంతో కనిపిస్తాడు. గతంలో వచ్చిన సినిమాల్లో రావణాసురుడు ఎలా ఉంటాడు చెప్పండి. ఒంటినిండా బంగారం..శివుడి భక్తుడు కాబట్టి హర హర మహాదేవ్ అంటూ జపించడం వంటివి కనిపిస్తాయి.

ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చూశాక.. థియేటర్లో ఉన్న ప్రేక్షకులు ‘ఓం కమ్ టు మై రూమ్’ అనడం ఖాయమనడంలో అతిశయోక్తి లేదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus