Bigg Boss Telugu 6: 10 మంది నామినేట్ అయ్యింది వీళ్లే..!

  • September 19, 2022 / 03:47 PM IST

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం నామినేషన్స్ ఒక రేంజ్ లో జరిగినట్లుగా సమాచారం తెలుస్తోంది. హాట్ స్టార్ లైవ్ లో 6 గంటల నుంచీ నామినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక రీసంట్ గా వచ్చిన ప్రోమోలో చూసినట్లయితే, నిర్భయంగా ధైర్యంగా నామినేట్ చేయమని బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు. దీంతో హౌస్ మేట్స్ రెచ్చిపోయారు. ముఖ్యంగా గీతుతో ఇనయ, సుదీప, నేహా ముగ్గురూ ఆర్గ్యూమెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఒక్కొక్కరు ఈసారి కూడా ఒకర్ని మాత్రమే నామినేట్ చేశారా లేదా ఇద్దర్ని నామినేట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. హౌస్ మేట్స్ ముఖంపై పెయింట్ పూసి మారీ రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు హౌస్ మేట్స్ దీంతో చాలామంది హౌస్ మేట్స్ నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే గీతుకి ఇంకా ఇయనకి ఇద్దరికీ సాలిడ్ గా ఫైట్ అయ్యింది. నువ్వు దొబ్బేయ్ అంటే నువ్వు దొబ్బేయ్ అంటూ ఇద్దరూ రెచ్చిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న బజ్ ప్రకారం మనం చూసినట్లయితే పదిమంది వరకూ నామినేట్ అయ్యారు.

నిజానికి 11మంది నామినేట్ అయితే ఒకర్ని కెప్టెన్సీ పవర్ ద్వారా రాజ్ సేఫ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి వాళ్లెవరనేది ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే కానీ తెలియదు. ప్రస్తుతానికి అయితే పదిమంది వరకూ లిస్ట్ లో ఉన్నారు. వాళ్లలో బాలాదిత్య, చంటి, రేవంత్, శ్రీహాన్ , ఆరోహి, నేహా, వాసంతీ, ఇనయ, గీతు, సుదీప ఉన్నట్లుగా సమాచారం. గత సీజన్స్ లో పార్టిసిపెంట్స్ ఎక్కువమంది ఫస్ట్ వీక్స్ లోనే కనిపించేవారు. అందుకే ఇద్దరిద్దరిని నామినేట్ చేసేవారు.

కానీ ఈసారి సీజన్ లో ఏకంగా 21మంది రావడం ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ టైమ్. నామినేషన్స్ మూడోవారం హౌస్ మేట్స్ ఓపెన్ అయి మరీ తిట్టుకున్నారు. ఆదిరెడ్డి కూడా ఫ్రస్టేట్ అయ్యి కలర్ బౌల్ ని ఎత్తిపారేస్తా అంటూ రెచ్చిపోయాడు. అలాగే, గీతు ఇంకా సుదీప ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ లో సుదీప బాగా ఎమోషనల్ అయిపోయింది. ప్రోమోలో చూస్తుంటే గీతుకి ఎక్కువగా ఓట్లు పడినట్లుగా తెలుస్తోంది. మరి ఈ నామినేషన్స్ లో ఎవరు సిల్లీ రీజన్స్ చెప్పారు అనేది తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకూ వెయిట్ చేయాల్సిందే. అదీ మేటర్.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus