మళ్ళీ మొదలైన శుక్రవారం సినిమాల సందడి

  • February 6, 2019 / 10:36 AM IST

2018 డిసెంబర్ 29 వరకూ కూడా వారానికి కనీసం మూడు సినిమాలు విడుదలయ్యేవి. అలాంటిది 2019 మొదలై నెల పూర్తవుతున్నా కూడా వారానికి కనీసం రెండు సినిమాలు కూడా విడుదలవ్వడం లేదు. తెలుగులో మాత్రమే కాక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల నుంచి కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో సినిమా లవర్స్ అందరూ ఢీలాపడిపోయారు. అయితే.. వాళ్లందరికీ ఊపిరి పోసేందుకు ఈవారం ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు, రెండు ఇంగ్లీష్ సినిమాలు విడుదలవుతున్నాయి.

మమ్ముట్టి ప్రధాన పాత్రలో వై.ఎస్.ఆర్ బయోపిక్ గా రూపొందిన “యాత్ర” ఈ శుక్రవారం విడుదలవుతున్న సినిమాల్లో పెద్దది, ప్రముఖమైనది. ఈ సినిమా మీద చాలా మంచి క్రేజ్ తోపాటు, పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా ఉంది. అలాగే.. నేషనల్ అవార్డ్ గెలుచుకోవడంతోపాటు ఆస్కార్ రేసులోనూ నిలిచిన తమిళ చిత్రం “విశారనై”ను “విచారణ” అనే పేరుతో అనువదించి విడుదల చేస్తున్నారు. దీంతోపాటు “సీమా రాజా” అనే మరో అనువాద చిత్రం కూడా విడుదలవుతుంది. శివకార్తికేయన్, సమంత, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సిమ్రాన్ ప్రతినాయక పాత్ర పోషించడం విశేషం. తమిళనాట యావరేజ్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి. ఇక సచిన్ జోషి హిందీతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో నటించి, నిర్మించిన “అమావాస్య” అనే సినిమా కూడా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంతోనైనా హీరోగా తనకు పేరు వస్తుందని సచిన్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు. అలాగే.. హాలీవుడ్ నుంచి యాక్షన్ ప్యాక్డ్ “కోల్డ్ పర్స్యూట్, అలిటా బ్యాటిల్ ఏంజెల్” అనే సినిమాలు విడుదలవుతున్నాయి. సో, కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఈ వీకెండ్ మొత్తం సినిమాలతో టైమ్ పాస్ చేసేయొచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus