2020 లో బాక్సాఫీస్ హిట్స్ ఇవే..!

మనం 2020 సంవత్సరంలోకి అడుగుపెట్టి అప్పుడే 6 నెలలు పూర్తయిపోయింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ఏడాది వైరస్ మహమ్మారి ఎంటర్ అవ్వడంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసి.. థియేటర్లను కొన్నాళ్ల పాటు మూసి వెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో తాత్కాలికంగా థియేటర్లు మూతపడ్డాయి. మూడు నెలలు పూర్తయినా ఇంకా తెరుచుకోలేదు.షూటింగ్ పూర్తయ్యి విడుదల కావాల్సిన ‘వి’ ‘ఉప్పెన’ ‘రెడ్’ వంటి సినిమాలు విడుదల కాలేదు.

ఇక చాలా సినిమాల షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. ఐదవ విడత లాక్ డౌన్ లో షూటింగ్ లకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా ఇంకా స్టార్ట్ చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా మొదటి 6 నెలల్లో హిట్ అయిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1)అల వైకుంఠపురములో :

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12 న విడుదలైంది.ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం ఇదే.ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 161.22 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

2) సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 11న విడుదలైంది. ఈ చిత్రం కూడా వరల్డ్ వైడ్ గా 138.37 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

3) భీష్మ :

‘లై’ ‘ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి 3 డిజాస్టర్లతో డీలా పడిపోయిన నితిన్ కు.. ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుములు ‘భీష్మ’ తో సూపర్ హిట్ ను అందించాడు.ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం 28.52 కోట్ల షేర్ ను వసూల్ చేసింది.

4) హిట్ :

విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాని నిర్మించాడు.ఫిబ్రవరి 28న విడుదలైన ఈ చిత్రం టైటిల్ కు తగ్గట్టే హిట్ అనిపించుకుంది. ఈ చిత్రాన్ని 4కోట్ల డిస్ట్రిబ్యూట్ చెయ్యగా.. 7.26 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

5) కనులు కనులను దోచాయంటే :

దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 28న విడుదలయ్యింది. డేసింగ్ పెరియసామి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం చప్పుడు లేకుండా విడుదలయ్యింది.తెలుగులో ఈ చిత్రాన్ని 0.80 కోట్లకు కొనుగోలు చెయ్యగా 0.98కోట్ల షేర్ ను వసూల్ చేసి హిట్ గా నిలిచింది.వైరస్ మహమ్మారి లేకుండా ఉండి ఉంటే ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసి ఉండేదేమో.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus