శివతో వర్మ తెచ్చిన మార్పులు ఇవే

  • May 26, 2017 / 11:38 AM IST

కాంట్రవర్సీ ట్వీట్స్, అగ్రెసివ్ స్టేట్ మెంట్స్ ఆయన్ని ఎప్పుడూ న్యూస్ లో ఉంచుతాయి. ఆయన కొత్త సినిమా రిలీజ్ అయిన ప్రతి సారి “హి ఈజ్ బ్యాక్” ఏమో అనే హోప్ కలిపించటం, తీరా రిలీజ్ అయ్యాక “హి ఈజ్ స్టిల్ ఇన్ బ్యాక్” అనిపించుకోవడం ఆయన స్పెషాలిటీ. రీసెంట్ గా సర్కార్ 3 తో మళ్లీ క్రిటిక్స్, ఆడియన్స్ అందరితో వీడు ఇంక మారడు అనిపించుకున్న వర్మ, మారక ముందు ఎలా ఉండేవాడో మాట్లాడుకుందాం.

వర్మ డైరెక్టర్ అవటానికి ఎవడి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదని ప్రూవ్ చేసి, తనకి ఉన్న పైరసీ వీడియో కేసెట్ పార్లర్ నే ఫిలిం స్కూల్ గా మార్చుకుని, ఒక జనరేషన్ డైరెక్టర్స్ అందరికి హోల్ సేల్ గా గురువు అండ్ ఇన్స్పిరేషన్ గా మారిన పర్సన్.

సరైన హిట్టు సినిమా తీసి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ కావొస్తున్నా సరే ఇప్పటికీ తన సినిమా రిలీజ్ ఉంది అంటే మళ్లీ ఒక ఆత్రుత, బజ్ క్రియేట్ చేయగల డైరెక్టర్ వర్మ. ఇన్నేళ్లల్లో ఒక్క హిట్టు లేకపోయినా సరే ఇంకా ఆ క్రేజ్ ఉంది అంటే ఆ కటౌట్ కి పడ్డ ఫౌండేషన్ అలాంటిది మరి. ఆ ఫౌండేషన్ పేరు శివ. ఆ ఒక్క సినిమా తెలుగు సినిమా షేప్, శాఖల్ని మార్చేసింది. చరిత్రకి BC, AC లాగ ఇండస్ట్రీకి శివ సినిమా ముందు, శివ సినిమా తరువాత అని చెప్తుంటారు. అంత ఇంపాక్ట్ చూపించింది ఈ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద.
శివ సినిమాతో ఇండస్ట్రీ ని మార్చేశాడు అని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం కానీ అసలు మన పాత తెలుగు సినిమా ఎలా ఉండేదో చాలా మందికి ఇప్పుడు తెలీదు కాబట్టి, అసలు రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో ఫిల్మ్ మేకింగ్ లో తీసుకొచ్చిన మార్పు ఏంటో కూడా అందరికి తెలీదు. ఇప్పుడు ఏదో శివ సినిమాని డీప్ అనాలిసిస్ చేసేసి డీటెయిల్ గా మాట్లాడటం కాకుండా రఫ్ గా, ఇండస్ట్రీ కి రాంగోపాల్ వర్మ తీసుకొచ్చిన మార్పులు ఏంటో మాట్లాడుకుందాం.

1. టోన్బేసిక్ గా ప్రతి మూవీ కి ఒక టోన్ ఉంటుంది, ఆ సినిమా కంటెంట్ , మూడ్ ని బట్టి ఆ సినిమా అంతా ఆ టోన్ లోనే ఉంటుంది , శివ సినిమా ముందు వచ్చిన మన సినిమాలన్నీ సీన్ తో , కంటెంట్ తో , సిట్యుయేషన్ తో సంబంధం లేకుండా అన్ని ఒకేలాగా , ఒకే టోన్ లో స్క్రీన్ ఎంత బ్రైట్ గా , కలర్ ఫుల్ గా ఉంటె అంతబావున్నట్టు అనే ఫీలింగ్ లో ఉండేవి. బట్ శివ మూవీ ని మనం ఇప్పుడు చూసినా ఫ్రెష్ గా ఉండటానికి కారణమే టోనే. ప్రొపెర్ ప్లానింగ్ అండ్ విజన్ తో సినిమా అంతా సీన్ అండ్ కంటెంట్ వైస్ తాను మైంటైన్ చేసిన లైటింగ్ పాటర్న్ యే దీనికి కారణం.

2. హీరో మనకి హీరో అంటే పాటలకి డాన్స్ లు వేయాలి, ఫైట్ లుచేయాలి, విలన్ తో భారీ పంచ్ డైలాగ్ లు చెప్పాలి, ఇది మన ఓల్డ్ ఫిలిమ్స్ రూల్. శివ లో హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ నుండి హీరో లాగా బెహేవ్ చేయడు, ఒక నార్మల్ కాలేజీ స్టూడెంట్ లాగే ఉంటాడు, ఇంఫాక్ట్ మన తెలుగు సినిమా హీరోకి ఉన్నట్లు స్పెషల్ ఇంట్రో సీన్ కూడా ఉండదు. ఒక నార్మల్ కాలేజీ స్టూడెంట్ లాగా స్టార్ట్ అయి హీరోగా ఎలా మారాడు అనే హీరో జర్నీ ఉంటుంది.

3. రియల్ క్యారెక్టర్స్శివ సినిమాలో హీరో కానీ, హీరో ఫ్రెండ్స్ కానీ, హీరోయిన్, విలన్, విలన్ పక్కన బ్యాచ్ కానీ ఎవరు సినిమాటిక్ గా ఉండరు. శివలో చాలా ఒరిజినల్ క్యారెక్టర్స్ తో అప్పటి స్టూడెంట్స్ రిలేట్ చేసుకునేలాగా హీరో ఫ్రెండ్స్, కాంటీన్ లో ఉత్తేజ్, నానాజీ, జేడీ ఇవన్నీ మనం బయట, కాలేజీ లో చూసే వెరీ ఒరిజినల్ క్యారెక్టర్స్, సినిమాటిక్ గా వెళ్లకుండా వీటినే ఒరిజినల్ గా చూపించాడు.

4. బ్యాగ్రౌండ్ మ్యూజిక్సీన్ కంటెంట్ తో సంబంధం లేకుండా ఎక్కువ డప్పులతో నింపకుండా, సీన్ లో ఎమోషన్ ని క్యారీ చేస్తూ చేసిన RR ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ఎస్పెషల్లీ ఆ సుత్తి తో కొడుతున్న బాంగ్ సౌండ్ ఇప్పటికీ చాలా ఫేమస్.సినిమాకి ఒక థీమ్ మ్యూజిక్ హైలైట్ అవటం మే బి ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా.

5. సౌండ్ మిక్సింగ్ఈ కేటగిరీ కి ఐతే అప్పటి వారికి మనవాళ్ళు కనీసం ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు. సౌండ్ ఎఫెక్ట్స్ సినిమా ఎక్స్పీరియన్స్ ని చేంజ్ చేయలేవు అని మన వాళ్ళ ఒపీనియన్. సీన్స్ లో చాలా ప్లేసెస్ లో RR ని సైలెంట్ లో పెట్టేసి, ఓన్లీ ఫుట్ సౌండ్స్, వెహికిల్ సౌండ్స్ ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ అన్నిటికి సౌండ్ ఎఫెక్ట్స్ ఆడ్ చేసి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని కొత్తగా ఫీల్ అయేలా చేసాడు. దీని తరువాతే అందరికి సినిమాకి సౌండ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్ధమయింది.

6. లైటింగ్శివకి ముందు ఐతే, మన దగ్గర లైటింగ్ తో ప్లే చేస్తూ తీసిన సినిమాలేదనే చెప్పాలి. లైటింగ్ మూడ్ వల్ల కూడా సీన్ ఇంపాక్ట్ మారుతుంది అని ప్రూవ్ చేసాడు. శివలో చిన్నాని చంపే సీన్ లో గోడ మీద షాడోస్ ని చూపించే సీన్ గుర్తుందా, అది జస్ట్ ఒక ఉదాహరణ … వర్మ ఈ సినిమాలో లైటింగ్ ని కూడా ఒక టూల్ గా వాడుకున్నాడని చెప్పడానికి.

7. కెమెరా యాంగిల్స్కొత్తది, ఎక్స్పెరిమెంటల్ షాట్ అనే వర్డ్స్ కూడా మన సినిమాల్లో కనిపించవు కాబట్టి అన్ని సినిమాల్ని మన వాళ్ళు ఒకే లాగేచూసేవాళ్లు. సినిమాలో హీరో, హీరోయిన్, పాటలు, ఫైట్స్ మాత్రమే కాకుండా ఆడియన్స్ ని కెమెరా యాంగిల్స్ గురించి కూడా మాట్లాడుకునే పోసిషన్ కి తీసుకొచ్చాడు. శివలో కార్ కింద కెమెరా, టేబుల్ కింద కెమెరా ఇలా చాలా కొత్త షాట్ మేకింగ్ వల్ల సినిమా చాలా ఫ్రెష్ గా కనపడింది. స్పెషల్లీ ఫైట్స్, చేస్ సీన్స్ లో స్టడీ కాం వాడటం వల్ల ఆడియన్స్ కి రియలిస్టిక్ ఫీల్ వచ్చి శివ సినిమా అంత కొత్తగా కనపడింది. అప్పటి వారికి ఇండియా లో స్టడీ కామ్ ఎవరు వాడలేదు, ఈ సినిమాకి ఉస్ చేద్దామని వర్మ అడిగాడు, దానికి డీఓపీ గోపాల్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, స్టడీ కామ్ తో ఫ్రేమ్ సెంటర్ చేయటం కష్టం, ఫోకస్ హేండిల్ చేయలేము అని చెప్పారు. దానికి RGV ఆన్సర్ ఏంటంటే ఫాస్ట్ గా జరిగిపోయే ఫైట్ సీక్వెన్స్ కి , చేస్ సీక్వెన్స్ కి ఫోకస్ అవసరంలేదు అని , అండ్ ది రెస్ట్ ఈజ్ హిస్టరీ . శివ రిలీజ్ అయ్యాక ఇండియాకి ఇంకో 7 స్టడీ క్యామ్స్ ఇంపోర్ట్ అయ్యాయి అంట.

8. కాస్ట్యూమ్స్మన సినిమాల్లో హీరో కాస్ట్యూమ్స్ అంటే పైన కింద మాచింగ్ మాచింగ్ కలర్స్ తో , పూల సొక్కాలతో , పక్కన హీరోయిన్ కాస్ట్యూమ్ కి మాచింగ్ తో , బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఆర్టిస్ట్ లని డామినేట్ చేసే లాగ టూ బ్రైట్ కలర్స్ వాడేవారు. కానీ శివ లో అలా ఓవర్ ది బోర్డు లుక్స్ కానీ, కలర్స్ కానీ అసలు నో ఛాన్స్. శివ తరువాత హీరోస్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారింది.

9. ఫైట్స్ డిషూమ్, డిష్కియా, ఏ బిషా … ఈ వర్డ్స్ గుర్తున్నాయా, మన సినిమాల్లో ఫైట్స్ అంటే ఇవేమరి, హీరో గాల్లో ఎగరటం, పల్టీలు కొట్టటం ఇలాగే ఉండేవి, కానీ శివలో ఇలాంటి ఫేక్ ఎలేవేషన్స్ ఉండవు, సినిమాలో ఫైట్ పోర్షన్ అంతా కడుపులో గుద్దటం, జా కింద పంచెస్ ఎక్కువగా ఇవే ఉండి వెరీ రియలిస్టిక్ కాలేజీ గొడవల్లా ఉంటాయి, అండ్ ఈ ఫైట్స్ అన్ని వర్మ యే కంపోజ్ చేసాడు.

10. విలన్స్మనకి అప్పటికి విల్లన్ అంటే ఇలా ఉండాలి, పక్కన గూండాలు అంటే ఇలా ఉండాలి అని ఒక రూల్ ఉంది, చూడగానే భయం వేసేలాగా, గట్టిగా అరుస్తూ, కన్నింగ్ గా చూస్తూ, సీరియస్ గా మాట్లాడాలి. విలన్ అంటే ఇవి మినిమం ఉండాలి. శివ లో విలన్స్ ఎవరు అలా ఉండరు ఇంఫాక్ట్ మీరు పరిశీలించారో లేదో విలన్ కి అమ్మాయి పేరు భవాని. రెగ్యులర్ గా ఉండే తెలుగు సినిమా లౌడ్ విలన్ కాకుండా ఈ విలన్ క్యారక్టరైజేషన్ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్.

ఒక సినిమా తో ఏదో ఒక విషయం లో ట్రెండ్ సెట్ చేయటం, ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్ లో చేంజ్ తీసుకురావటం కామన్ థింగ్. కానీ ఒక అవుట్ సైడర్ వచ్చి కంప్లీట్ అప్పటివరకు ఉన్న ఇండియన్ సినిమా మేకింగ్ స్టయిల్ నే మార్చేయటమనేది ఓన్లీ వర్మకే సాధ్యం . ఆయన ప్రెసెంట్ తీస్తున్న ఐస్ క్రీమ్స్ ని మనం భరిస్తున్నాం అంటే దానికి కారణం ఆ పాత వర్మనే. సో మళ్లీ ఆ ఓల్డ్ వర్మ ఫామ్ లోకి రావాలని నేను కోరుకుంటున్నాను.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus