Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సత్యదేవ్ (Hero)
  • ఆనంది (Heroine)
  • హర్ష్ రోషన్, వంశీకృష్ణ, సురభి ప్రభావతి, నాజర్, రఘుబాబు, అమిత్, రవివర్మ తదితరులు.. (Cast)
  • సూర్య కుమార్ (Director)
  • సాయిబాబు జాగర్లమూడి - వై.రాజీవ్ రెడ్డి (Producer)
  • నాగవెల్లి విద్యాసాగర్ (Music)
  • సమీర్ రెడ్డి (Cinematography)
  • చాణక్య రెడ్డి (Editor)
  • Release Date : ఆగస్ట్ 08, 2025
  • ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ (Banner)

సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో క్రిష్ రచన మరియు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన సిరీస్ “అరేబియా కడలి”. సూర్య దర్శకత్వం వహించిన ఈ సిరీస్ చాలా మినిమల్ ప్రమోషన్స్ తో విడుదలైంది. ఇదే కథతో ఆల్రెడీ “తండేల్” సినిమా రిలీజ్ అయ్యి ఉండడం అందుకు కారణంగా పేర్కొనవచ్చు. మరి తెలిసిన కథను క్రిష్ & టీమ్ ఎంత ఆసక్తికరంగా సిరీస్ రూపంలో తెరకెక్కించగలిగారు? అనేది చూద్దాం..!!

Arabia Kadali Review.

కథ:

భద్రపట్నంకు చెందిన బద్రి (సత్యదేవ్) మరియు అతని తోటి జాలర్లు అందరూ చేపలు పట్టే క్రమంలో ఇండియా బోర్డర్ దాటి, పాకిస్థాన్ లోకి వెళ్లి అక్కడి ఆర్మీతో అరెస్ట్ చేయబడి పాకిస్థాన్ జైల్లో ఇరుక్కుంటారు. వాళ్లను బయటకు తీసుకురావడం కోసం అటు ప్రభుత్వంతోపాటుగా ఇటు గంగ (ఆనంది) కూడా తన శక్తికి మించి ప్రయత్నిస్తుంటుంది.

ఈ క్రమంలో పాకిస్థాన్ లో మత్స్యకారులు, ఇండియాలో గంగ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? చివరికి వారు ఇండియాకి తిరిగి వచ్చారా? వచ్చిన తర్వాత వాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందా? అనేది “అరేబియా కడలి” సిరీస్ చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు:

సత్యదేవ్ ఏ పాత్ర పోషించినా దాన్ని ఓన్ చేసుకుంటాడు. అందువల్ల ఒక పది నిమిషాల తర్వాత మనం సత్యదేవ్ ను కాక అతడు పోషించిన బద్రిగా మాత్రమే అతడ్ని చూస్తాం. ఎన్నో ఎమోషన్స్ ను తనదైన శైలిలో పండించాడు సత్యదేవ్. ముఖ్యంగా జైల్ ఎపిసోడ్స్ లో అతడు చూపిన పరిణితిని కచ్చితంగా మెచ్చుకోవాలి.

సత్యదేవ్ స్థాయిలోనే నటించి అతడికి పోటీగా నిలిచింది ఆనంది. ముఖ్యంగా ఫైనల్ ఎపిసోడ్ లో తనవాళ్లు విడుదలవుతున్నారనే ఆనందం కంటే.. మళ్లీ వాళ్లు బ్రతుకు తెరువు కోసం అదే సముద్రంలోకి వెళ్లాలనే బాధను ఆమె వ్యక్తపరిచిన సన్నివేశం సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుంది.

వంశీకృష్ణను రెగ్యులర్ గా విలన్ గా చూసి చూసి బోర్ కొట్టడంతో ఈ సిరీస్ లో అతడు పోషించిన సపోర్టింగ్ రోల్ లో కొత్తగా కనిపించాడు. నెగిటివిటీతోపాటు పాజిటివ్ ఆటిట్యూడ్ కూడా కనబడిచే అతడి పాత్ర కాస్త రిలేటబుల్ గా ఉంటుంది.

సత్యదేవ్ స్నేహితులుగా నటించినవారు, భద్రపట్నం గ్రామస్తులుగా నటించినవాళ్లందరూ చాలా సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. అదే విధంగా యాస, మాండలీకం విషయంలోనూ మంచి చొరవ కనబరిచారు.

పాకిస్థానీయులుగా పూనం భజ్వా, అమిత్ లు ఆకట్టుకోగా.. భారతీయ కమిషన్ టీమ్ గా నాజర్, రవివర్మలు మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో సిరీస్ కి వెల్యు యాడ్ చేసారు.

సాంకేతికవర్గం పనితీరు:

సమీర్ రెడ్డి విజువల్స్, విద్యాసాగర్ నేపథ్య సంగీతం, చాణక్య రెడ్డి ఎడిటింగ్ సిరీస్ కి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. సమీర్ రెడ్డి సముద్రాన్ని, అందులోని జాలర్ల జీవితాల్ని సహజంగా తెరకెక్కించగా, విద్యాసాగర్ సంగీతం ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. ఇక చాణక్య రెడ్డి ఎడిట్ ప్యాటర్న్, ట్రాన్సిషన్స్ సిరీస్ లోని ఎమోషన్ ను విజువల్ గా ఎలివేట్ చేశాయి.

నిర్మాత, రచయిత క్రిష్ ఈ కథను మత్స్యకారులు కేవలం పాకిస్తాన్ నుండి ఇండియాకు తిరిగిరావడమే ధ్యేయంగా కాక, వారి అస్తిత్వం కోసం వాళ్లు చేసే పోరాటానికి సమాధానం కోసం సిరీస్ ను నడిపించిన తీరు బాగుంది. క్రిష్ రైటింగ్ లో కమర్షియాలిటీ కంటే మానవీయ విలువలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. “అరేబియా కడలి” సిరీస్ లోనూ అదే కనిపించింది. ఇండియాలో అంటే కులం, ప్రాంతం అని కొట్టుకుంటున్నాం కానీ.. ఒక్కసారి బయటకి వెళ్తే మనిషిగా మాత్రమే విలువ ఇస్తారు అనే మెసేజ్ ను అంతర్లీనంగా ఇచ్చిన విధానం ఆలోచింపజేస్తుంది. రైటింగ్ పరంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. చివరి ఎపిసోడ్ ను మాత్రం చుట్టేసిన భావన కలుగుతుంది.

దర్శకుడు సూర్య కుమార్ కథను అర్థం చేసుకొని, అందుకని ఎమోషన్స్ ను ఎలివేట్ చేస్తూ సిరీస్ ను తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం. అయితే.. సినిమాటిక్ లిబర్టీస్ & రియాలిటీని బ్యాలెన్స్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. అందువల్ల కొన్నిచోట్ల సహజత్వం తొణికిసలాడితే, ఇంకొన్ని చోట్ల అసహజత్వం ఇబ్బందిపెట్టింది. కానీ.. ఎమోషన్ తో దాన్ని మ్యానేజ్ చేసారు.

విశ్లేషణ:

ఆల్రెడీ “తండేల్”లో చూసిన కథ అనే లాజిక్ ను అధిగమించడం అనేది “అరేబియా కడలి” బృందానికి ఎదురయ్యే పెద్ద తలనొప్పి. ఎంత వైవిధ్యంగా తెరకెక్కించినా తెలిసిన కథను మళ్లీ చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిచూపడం అనేది కొంచం కష్టం. అయితే.. “అరేబియా కడలి” కథ చాలా లేయర్స్ ను డీల్ చేస్తుంది. తెలిసిన కథను మరో కోణంలో చూపించే ప్రయత్నం చేస్తుంది. కాస్త సమయం వెచ్చించగలిగితే “అరేబియా కడలి” కచ్చితంగా ఆకట్టుకుంటుంది. సత్యదేవ్ & ఆనందిల నటన, క్రిష్ & సూర్య కుమార్ ల రైటింగ్-టేకింగ్ ఈ సిరీస్ ను బింజ్ వాచ్ చేసేలా చేసింది.

ఫోకస్ పాయింట్: మానవీయ కోణంలో సాగే సర్వైవల్ థ్రిల్లర్!

 

రేటింగ్: 3/5

సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus