Bigg Boss 5 Telugu: 4వ వారం డేంజర్ జోన్ లో ఉంది వీళ్లే..!

  • September 29, 2021 / 11:55 AM IST

బిగ్ బాస్ హౌస్ లో ఈసారి సీజన్ లో రోజు రోజుకీ ఆటపై ఆసక్తిపెరిగిపోతోంది. పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నా కూడా ప్రజలు మాత్రం షోని జేజేలు కొడుతున్నారు. వారికి నచ్చిన కంటెస్టేంట్ కి ఓట్లు వేసి మారీ తమ మద్దతుని తెలుపుతున్నారు. అయితే ఈవారం అనూహ్యంగా 8మంది నామినేషన్స్ లోకి రావడం విశేషం. వీరిలో ఇప్పుడు ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. కొన్ని అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ చూస్తే ఎనిమిదిమందిలో ముగ్గురు వెనకబడి ఉన్నారు.

వారిలో అనీమాస్టర్, లోబో, నటరాజ్ మాస్టర్ లు కూడా ఉన్నారు. ఇప్పుడు వీరిలో ఎవరు వెళ్లిపోతారు అనేది ఆసక్తికరంగా మారింది. లీస్ట్ ఓటింగ్ లో లోబో, అనీమాస్టర్ , నటరాజ్ మాస్టర్ లు ఉన్నారు. వీళ్లు టాస్క్ బాగా ఆడితే ఖచ్చితంగా ఓటింగ్ ని మెరుగుపురుచుకుంటారు. అప్పుడు సిరి, కాజల్ కూడా డౌన్ లోకి వచ్చేస్తారు. ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్నవారిలో రవి, సన్నీ , ప్రియలకి ఢోకాలేదు. ఇక మద్యలో సిరి అండ్ కాజల్ ఇద్దరూ ఉన్నారు. అయితే, వీళ్లకి లీస్ట్ లో ఉన్నవారికి వ్యత్యాసం అనేది చాలా తక్కువ.

కాబట్టి లాస్ట్ డే ఓటింగ్ లో ఏదైనా జరగచ్చు. అందుకే, ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది బిగ్ బాస్ లవర్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఇక హౌస్ లో టాస్క్ ఆధారంగా, వాళ్ల పెర్ఫామన్స్ ఆధారంగానే డేంజర్ జోన్ లో ఉన్న ముగ్గురు వారి ఓటింగ్ ని మెరుగుపరచుకోవాల్సి ఉంది. అదీ మేటర్.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus