ఈ 15 సినిమాల సీక్వెల్స్ ఉంటాయని చెప్పారు కానీ రాలేదు..!

టాలీవుడ్ లో సీక్వెల్స్ వర్కౌట్ అవ్వడం లేదు అని గతంలో వార్తలు వినిపించాయి. అయితే బంగార్రాజు, ఎఫ్3, కార్తికేయ2, చిత్రం 1.1 వంటి సీక్వెల్స్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో కొన్ని క్రేజీ సినిమాలకు సీక్వెల్స్ ఉంటాయని ఆ చిత్రాలకు సంబందించిన దర్శక నిర్మాతలు ప్రకటించారు కానీ.. ఇప్పుడు వాటిని గాలికి వదిలేశారు. అలా ఆగిపోయిన సీక్వెల్స్ ఏంటో తెలుసుకుందాం రండి :

1) బిజినెస్ మెన్ 2 :

‘బిజినెస్ మెన్’ సినిమా విడుదలైన టైంలోనే దీనికి సీక్వెల్ ఉంటుంది అని చెప్పాడు దర్శకుడు పూరి జగన్నాథ్. కానీ ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్ట్ మొదలు కాలేదు.

2) కిక్ 3:

కిక్ కి ఆల్రెడీ కిక్ 2 అంటూ ఓ సీక్వెల్ వచ్చింది.దాని ఎండింగ్ టైటిల్స్ లో కిక్ 3 ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ దాని గురించి దర్శక నిర్మాతలు ఎటువంటి స్టెప్ తీసుకోలేదు.

3) రాజా సర్దార్ గబ్బర్ సింగ్ :

గబ్బర్ సింగ్ కు సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చింది. ఆ సినిమా ఎండింగ్ టైటిల్స్ లో రాజా సర్దార్ గబ్బర్ సింగ్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇప్పుడు దాని పై దృష్టి పెట్టడం లేదు.

4) రాజా ది గ్రేట్ 2 :

ఈ చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు దాని ఊసే లేదు.

5) కబాలి2 :

కబాలి కి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ దానిని దర్శకుడు పట్టించుకోవడం లేదు.

6) తుపాకీ2 :

ఈ సూపర్ హిట్ మూవీకి కూడా సీక్వెల్ ఉంటుందని అప్పట్లో ప్రకటన వచ్చింది. కానీ ఇప్పట్లో కష్టమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

7) జెంటిల్ మెన్ 2 :

ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని మొన్నామధ్య నిర్మాత ప్రకటించాడు. కానీ ఇప్పట్లో అది జరిగేలా కనిపించడం లేదు.

8) విక్రమార్కుడు 2 :

రాజమౌళి కి ఇష్టమైన సినిమా విక్రమార్కుడు అని గతంలో చెప్పాడు. దీనికి సీక్వెల్ తియ్యాలని ఉంది అని కూడా ప్రకటించాడు. కానీ ఆ దిశగా అతను అడుగులు వెయ్యలేదు.

9) ఈగ 2 :

నాని, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈగ చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుందని రాజమౌళి చెప్పాడు. కానీ తరువాత పట్టించుకోలేదు.

10) అడవి2:

నితిన్ – రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అడవి’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ అది తెరకెక్కలేదు.

11) అదుర్స్ 2 :

రభస, టెంపర్ ఆడియో రిలీజ్ వేడుకల్లో ఎన్టీఆర్ తో అదుర్స్ 2 ఉంటుందని.. వక్కంతం వంశీ కథ రెడీ చెయ్యాలని వినాయక్ తెలిపాడు. కానీ తరువాత దాని గురించి వాళ్ళు పట్టించుకోలేదు.

12) ఖైదీ2 :

కార్తీ హీరోగా నటించిన ఖైదీ కి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు లోకేష్ ప్రకటించాడు. కానీ దాని గురించి ఇప్పుడు అతను పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు

13) అ! 2 :

నాని నిర్మించిన అ! మూవీకి సీక్వెల్ ఉంటుందన్నారు. కానీ ఇప్పట్లో అది తెరకెక్కేలా కనిపించడం లేదు..!

14) జాంబీ రెడ్డి 2 

15) క్రాక్ 2

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus