Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 లో ఇస్తున్న ట్విస్ట్ ఏంటి ? ఈసారి స్కెచ్ మాములుగా లేదుగా..!

బిగ్ బాస్ హౌస్ లోకి 2. ఓ లాంఛింగ్ లో భాగంగా కొత్తవాళ్లు ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఐదు వారాల తర్వాత ఇలా ఐదుగురు ఒకేసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం అనేది సీజన్స్ లో ఇదే మొదటిసారి. ఉల్టా – పల్టా అంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తోళ్లు అందరూ గట్టోళ్లలాగానే కనిపిస్తున్నారు. అర్జున్ అంబటి అయితే ప్రతి ఎపిసోడ్ చాలా డిటైల్ గా అబ్జర్వ్ చేసినవాడిలా మాట్లాడాడు. అంతేకాదు, చాలా మెచ్యూర్ గా కూడా బిహేవ్ చేశాడు. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ కి కూడా అర్జున్ బాగా నచ్చేశాడు. అలాగే, మోడల్ అశ్విని కూడా తక్కువేం తినలేదు లేడీస్ ని టార్గెట్ చేసింది. ముఖ్యంగా శోభాని టార్గెట్ చేసినట్లుగానే మాట్లాడింది. అలాగే భోళ్, పూజా, నయనీ వీళ్లు కూడా బిగ్ బాస్ ఎపిసోడ్స్ ని బాగా ఫాలో అయ్యారు. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పుడు కొత్త కంటెస్టెంట్స్ కి హింట్స్ ఇచ్చి, కొన్ని పాయింట్స్ వర్కౌట్ చేయమని స్క్రిప్ట్ ఇచ్చి మరీ పంపారా అనే అంటున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. ఎందుకంటే, ప్రతి విషయంలో కూడా హౌస్ లో లాజిక్స్ వర్కౌట్ చేయాలి. అలాగే ఆర్గ్యూమెంట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడున్న బ్యాచ్ నామినేషన్స్ కూడా చాలా చప్పగా చేస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు కొత్త బ్యాచ్ ని దింపింది బిగ్ బాస్ టీమ్. ఇప్పుడు ఈ టీమ్ వల్ల కూడా కాకపోతే వేరే టీమ్ ని కూడా వైల్డ్ కార్డ్ ద్వారా రెడీ చేస్తున్నారు.

అంతేకాదు, సందీప్ ఇంకా అమర్ దీప్ ఇలా స్టార్ మా బ్యాచ్ కి లాజిక్స్ వర్కౌట్ చేయడం రావట్లేదు. ఎవరికి వారు గ్రూప్ గేమ్ గానే ఆడుతున్నారు. దీంతో అస్సలు వారిని వాళ్లు డిపెండ్ చేస్కోలేకపోతున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్లలో సీరియల్ బ్యాచ్ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారి ఆటని మార్చే ప్రయత్నం చేస్తారు. ఇదే బిగ్ బాస్ కి కూడా కావాల్సింది.

తన అనుకున్నవాళ్లకి ఎంత ప్రొటక్షన్ ఇస్తే అంత మంచింది. మరి ఈ సీజన్ లో ఎన్ని హింట్స్ ఇస్తున్నా కూడా వాళ్లకి అర్దం కావట్లేదు. ఎవరికి వాళ్లు ఇండివెడ్యువల్ గేమ్ ఆడుతున్నామనే అనుకుంటున్నారు. కానీ, గ్రూప్ గా ఆడుతున్నారు. ఇప్పుడు ఇది సరైనా లైన్లో పెట్టేందుకే బిగ్ బాస్ టీమ్ వీళ్లని పంపిందని కూడా టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో బ్యాడ్ నేమ్ రాకుండా మాత్రం స్టార్ మా సీరియల్ టీమ్ కి బిగ్ బాస్ టీమ్ మంచి సోపర్టింగ్ చేస్తునట్లుగానే కనిపిస్తోంది.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus