Celebrities: ఈ టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ కు బిర్యానీ అంటే ఇంత ఇష్టమా?

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఇష్టపడే వంటకాలలో బిర్యానీ ఒకటనే సంగతి తెలిసిందే. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఎక్కువగా బిర్యానీకి సంబంధించిన ఆర్డర్లు వస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ ను ఇష్టపడే వాళ్లలో ఎక్కువమంది చికెన్ బిర్యానీ తినడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. అయితే చాలామంది సెలబ్రిటీలు సైతం బిర్యానీని ఎంతగానో ఇష్టపడతారు.ఈ జాబితాలో టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఉన్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ బిర్యానీని ఎంతో ఇష్టపడతారని సమాచారం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిర్యానీని అద్భుతంగా వండుతారని తెలుస్తోంది. బాలీవుడ్ సినీ ప్రముఖులైన సల్మాన్, షారుఖ్, కరీనా, అమీర్ ఖాన్, తార సుతారీ బిర్యానీని ఎంతగానో ఇష్టపడతారని సమాచారం. తాజాగా పుట్టినరోజు జరుపుకున్న టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ సైతం బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారని తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ బిర్యానీని ఎంతగానో ఇష్టపడతారు. సారా అలీఖాన్ కూడా పలు సందర్భాల్లో తనకు బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. మలైకా అరోరా సైతం ఒక సందర్భంలో తనకు బిర్యానీ అంటే ఇష్టమని పేర్కొన్నారు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు సైతం బిర్యానీని ఎంతగానో ఇష్టపడతారని తెలుస్తోంది. తక్కువ ధరకే రుచిగా లభించే వంటకం కావడంతో ఎక్కువమంది బిర్యానీ లవర్స్ బిర్యానీని ఎంతగానో ఇష్టపడుతున్నారని తెలుస్తోంది.

బిర్యానీని ఇంత మంది సెలబ్రిటీలు ఇష్టపడుతున్నారని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. హైదరాబాదీ బిర్యానీ అంటే ఇష్టమని సెలబ్రిటీలు ఇంటర్వ్యూలలో వెల్లడిస్తున్నారు. సెలబ్రిటీలలో ఎక్కువమంది తమ ఫేవరెట్ ఫుడ్ ఏదనే ప్రశ్నకు బిర్యానీకి ఓటేయడం గమనార్హం. టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలలో కూడా ఎక్కువమంది హీరోలు బిర్యానీ ప్రియులని తెలుస్తోంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus