నెల జీతానికి సినిమాలు చేస్తున్న టాలీవుడ్ హీరోలు వీళ్లేనా..!

  • December 12, 2023 / 07:50 PM IST

సినిమా ఇండస్ట్రీ లో సరైన ప్లానింగ్ తో పోతే కెరీర్ ఎంతో అద్భుతంగా సాగుతూ ముందుకు పోతుంది. కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అంతే.. కొంతమంది హీరోలు ప్రారంభం లో తారాజువ్వ లాగా నింగికి ఎగురుతారు, ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ కారణంగా ఎంత వేగంగా అయితే దూసుకుపోయారో, అంతే వేగంగా క్రింద పడిపోతారు. అలా కెరీర్ ప్రారంభం లో అద్భుతమైన విజయాలను అందుకొని ఆ తర్వాత దానిని కొనసాగించలేకపోయిన కొంతమంది హీరోలు ఇప్పుడు నెల జీతంతో సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటున్నారు.

అలాంటి హీరోల లిస్ట్ తీస్తే ముందుగా మనం రాజ్ తరుణ్ గురించి మాట్లాడుకోవాలి. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దాదాపుగా మూడు కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ అందుకునే హీరో గా ఎదిగి, ఇప్పుడు నెలకు లక్ష రూపాయిల జీతం తో సినిమాలు చేస్తున్నాడు. ఇక రాజ్ తరుణ్ తర్వాత నెల జీతం తో పని చేస్తున్న మరో హీరో సందీప్ కిషన్. రాజ్ తరుణ్ కి అయినా రెండు మూడు హిట్ సినిమాలు ఉన్నాయి.

కానీ సందీప్ కిషన్ కి కేవలం ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా మినహా ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. కానీ పట్టువదలని విక్రమార్కుడు లాగ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అసలు ఒక్క సక్సెస్ లేకపోయినా కూడా నిర్మాతలు ఇతనితో సినిమాలు ఎలా చేస్తున్నారు అంటే, ఇతను కూడా సినిమాలు నెల జీతం తోనే చేస్తున్నాడు.వీళ్ళకంటే టాలీవుడ్ లో సీరియల్ హీరోలు మరియు హీరోయిన్లు ఎక్కువ రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు.

అయితే రాజ్ తరుణ్ (Raj Tarun) ఇప్పుడు హీరో రోల్ ని పక్కన పెట్టి నాగార్జున ‘నా సామి రంగ’ చిత్రం లో ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ తో పాటుగా రాజ్ తరుణ్ కూడా ఒక క్యారక్టర్ చేస్తున్నాడు. హీరో గా చేసిన రోజుల్లో తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే, ఈ సినిమాలో తీసుకున్న రెమ్యూనరేషన్ ఎక్కువట. సందీప్ కిషన్ కూడా ఇక క్యారక్టర్ రోల్స్ కి మారిపోతే బాగుండును అని నెటిజెన్స్ అనుకుంటూ ఉన్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus