టాలీవుడ్ స్టార్ హీరోలు గత కొన్నేళ్లలో తమ మార్కెట్ ను ఊహించని స్థాయిలో పెంచుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ప్రభాస్ నటించిన బాహుబలి2 సినిమా థియేటర్లలో 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కలెక్షన్ల రికార్డులను ఏ హీరో బ్రేక్ చేస్తాడో చూడాల్సి ఉంది. స్టార్ హీరోలంతా వేల కోట్ల క్లబ్బుల్లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా హీరోలుగా సత్తా చాటాలని టాలీవుడ్ హీరోలు భావిస్తున్నారు. పుష్ప సినిమాతో బన్నీకి ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చింది. అయితే బన్నీ తర్వాత సినిమాల ఫలితాలను బట్టి మాత్రమే బన్నీ మార్కెట్ ఏ స్థాయికి పెరిగిందో ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వేల కోట్ల క్లబ్బులో చేరతామని చరణ్, తారక్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
పుష్ప ది రైజ్ కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ పై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని సమాచారం.
విజయ్ దేవరకొండ లైగర్ తో, కళ్యాణ్ రామ్ డెవిల్ తో, అడివి శేష్ మేజర్ తో పాన్ ఇండియా హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రవితేజ టైగర్ నాగేశ్వరరావు పేరుతో తెరకెక్కుతున్న సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా లక్ ను పరీక్షించుకోనున్నారు. ఈ హీరోలలో ఎంతమంది హీరోలు పాన్ ఇండియా హీరోలుగా సత్తా చాటుతారో చూడాల్సి ఉంది. చిరంజీవి సైరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!