బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ పోటీ జరుగుతోంది. దీనికోసం హౌస్ మేట్స్ ని జంటలుగా విడిపోమని చెప్పాడు బిగ్ బాస్. ఇన్ని వారాల ప్రయాణంలో ఎవరితో మీరు జతకట్టాలని అనుకుంటున్నారు. మీ బెస్ట్ బడ్డీస్ ఎవరో అలా విడిపోమన్నాడు. ప్రస్తుతం 10మంది హౌస్ మేట్స్ ఉన్నారు కాబట్టి ఐదు జంటలుగా విడిపోయారు. ప్రిన్స్ – తేజ, శివాజీ – ప్రశాంత్ , శోభాశెట్టి – ప్రియాంక, శుభశ్రీ – గౌతమ్, సందీప్ – అమర్ ఇలా విడిపోయి స్మైలీ టాస్క్ ఆడారు. అసలు టాస్క్ ఏంటంటే, జంటలు ఇద్దరూ కూడా ఒకరి తర్వాత ఒకరు హర్టిల్స్ దాటుకుంటూ యాక్టివిటీ రూమ్ కి వెళ్లి అక్కడ థర్మాకోల్స్ టబ్ లో ఉన్న నెంబర్స్ ని తెచ్చి స్మైలీ డిజైన్ కి మ్యాచ్ చేయాలి. అదీ టాస్క. బిగ్ బాస్ ఈ టాస్క్ కి శోభాశెట్టి ఇంకా ప్రిన్స్ యావార్ లని సంచాలకులుగా నియమించాడు. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత తప్పుగా ఆడుతున్నారని తెలిసి కాసేపు పాజ్ చేశాడు బిగ్ బాస్.
మళ్లీ కాసేపు రూల్స్ చెప్పి ప్రారంభించమని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ రెచ్చిపోయి మరీ టాస్క్ ఆడారు. అయితే, సంచాలకులు మాత్రం ఎవరు గెలిచారు అనేది సరిగ్గా డెసీషన్ తీస్కోలేకపోయారు. చాలాసేపు తర్జన భర్జన పడి మూడుసార్లు విజేతలని మార్చారు. హౌస్ మేట్స్ ని ఆడియన్స్ ని కన్ఫూజ్ చేశారు. అసలు ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు అనేది ఫోటోస్ తో సహా ఒక్కసారి మనం చూసినట్లయితే.. కింద చూపించిన ఫోటో శివాజీ ప్రశాంత్ బెల్ కొట్టే సమయానికి పెట్టిన డిజైన్ ఇందులో కొన్ని పళ్లు ఉల్టా ఉన్నాయ్. అయినా కూడా కరెక్ట్ ప్లేస్మెంట్ లో ఉన్నాయ్. కానీ, ఒక పన్ను నెంబర్ అసలు అది మ్యాచ్ అవ్వలేదనిపిస్తోంది. అలాగే మిగతావి ఉల్టా ఉన్నాయ్. అయినా కూడా అందరికంటే ముందు బెల్ కొట్టారు కాబట్టి విజేతలుగా ప్రకటించవచ్చు. కానీ సంచాలకులు కన్ఫూజ్ అయిపోయి శివాజీ ప్రశాంత్ లని థర్డ్ ప్లేస్ లో పెట్టారు.
తర్వాత సందీప్ అమర్ జంట బెల్ కొట్టింది. ఫస్ట్ టైమ్ బెల్ కొట్టినపుడు పెట్టిన స్మైల్ డిజైన్.. ఇందులో ఒక రెండు పళ్లు మిస్సింగ్…మాస్టర్ గంట కొట్టిన కాసేపటికి అమర్ వచ్చి కొట్టాడు.. తర్వాత మాస్టర్ వెళ్తుంటే అమర్ 5 మాస్టర్ అంటూ నెంబర్ కూడా చెప్పాడు. దీన్ని బట్టే చెప్పొచ్చు కదా రెండు మిస్సింగ్ అని, కానీ బుర్రలేని సంచాలకులు ఇద్దరూ కూడా చాలాసేపు ఆలోచించిన తర్వాత శోభాశెట్టి నేను రేస్ లో తప్పుకుంటున్నాను అంటూ అమర్ ఇంకా సందీప్ ఇద్దరికీ కూడా సెకండ్ ప్లేస్ ఇచ్చేసింది. కింద ఫోటోలో మాస్టర్ బెల్ కొట్టినపుడు పోటోని క్లియర్ గా చూడండి. ఇక థర్డ్ టైమ్ బెల్ కొట్టిన శోభాశెట్టి ప్రియాంక జోడీ అందరికంటే స్మైల్ డిజైన్ ని బాగా అమర్చుకున్నారు. కానీ, తనని తాను తగ్గించుకుని ఫోర్త్ ప్లేస్ ఇచ్చుకుంది.
ఇక నాలుగో సారి బెల్ కొట్టిన గౌతమ్ అండ్ శుభశ్రీలకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది శోభాశెట్టి. ఇది కంప్లీట్ గా రాంగ్ డెసీషన్ అయిపోయింది. గౌతమ్ శోభా విసిరేస్తే ఏరుకుని వచ్చి నెంబర్ ని పెట్టాడు. గంట కొట్టాడు. ఫైనల్ గా స్మైల్ డిజైన్ చూపించారు. కానీ, సంచాలకులు ఇద్దరూ కూడా కలిసి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. నిజానికి ఆర్డర్ ప్రకారం చూస్తే ఆడియన్స్ చెప్తున్నా ఆర్డర్ ఏంటంటే, ఫస్ట్ ప్లేస్ లో శివాజీ – పల్లవి ప్రశాంత్ జంట, తర్వాత ప్లేస్ లో శుభశ్రీ ఇంకా గౌతమ్ జంట, మూడో ప్లేస్ లో ప్రియాంక ఇంకా శోభాశెట్టిలని పెట్టారు. దీన్ని బట్టీ నెక్ట్స్ ఏ లెవల్లో గేమ్ ఉంటుందంనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఫైట్ హౌస్ మేట్స్ మద్యలో చిచ్చు పెట్టింది.
ఇక బిగ్ బాస్ కూడా ఈ టాస్క్ లో పెద్ద తప్పు చేశాడు. సంచాలక్ గా ప్లేయర్స్ ని పెట్టాడు. అందులోనూ వేర్వేరు టీమ్స్ నుంచీ పెట్టడం వల్ల ఇద్దరూ ఒకసారి రైడ్ కి వెళ్లినపుడు అక్కడ చూసేవాళ్లు లేరు. అందులోనూ ఇద్దరూ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కన్ఫూజన్ అయ్యారు. అందుకే, సంచాలక్ డెసీషన్స్ ని మూడు సార్లు మార్చారు. హౌస్ మేట్స్ కూడా సంచాలక్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గొడవ గొడవ చేశారు. మొత్తానికి ఈ స్మైలీ టాస్క్ బిగ్ బాస్ ఇంట్లో నవ్వులు కాకుండా గొడవలకి కారణం అయ్యింది. అదీ మేటర్.