పెంపుడు జంతువులంటే చాలా మందికి ఇష్టం. భాగ్యనగరంలో పెట్స్ ని పెంచుకునే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. విదేశాలనుంచి అరుదైన కుక్కలను దిగుమతి చేసుకొని మరి పోషిస్తున్నారు. వాటితో సరదాగా గడిపి ఒత్తిడిని పోగొట్టుకుంటున్నారు. పెంపుడు కుక్కలను ముద్దుచేయడం, వాటిని ఎత్తుకొని తిరగడం, ఇంట్లో కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేయడం…
ఇదంతా జంతు ప్రేమికులకు బాగానే ఉంటుంది. మిగిలిన వారి పరిస్థితి ఏంటి? కుక్కలంటే భయపడేవారు ఏమనుకుంటారు? ఇలాంటి విషయాలన్నింటినీ మేళవించి ఈ వారం మహా తల్లి మనముందుకు వచ్చేసింది. “థింగ్స్ పెట్ లవర్స్ డు” అనే క్యూట్ వీడియోలో తన ముద్దుల లియో తో జాహ్నవి చేసిన హంగామా నవ్వులను పంచుతోంది.