‘తిప్పరామీసం’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

‘మెంటల్ మదిలో’ ‘నీది నాదీ ఒకే కథ’ ‘బ్రోచేవారెవరురా’ వంటి విభిన్న చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా పేరు సంపాదించుకున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ కుర్ర హీరో సినిమా అంటే కచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే తాజాగా వచ్చిన ‘తిప్పరామీసం’ సినిమా ఆ నమ్మకాన్ని చంపేసిందనే చెప్పాలి. ‘రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్’ బ్యానేర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్ట్ చేసాడు. నవంబర్ 8న(నిన్న) విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది.

‘అర్జున్ రెడ్డి’ సినిమానే కాస్త అటూ.. ఇటూ చేసి తీసారనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక రివ్యూలు, రేటింగ్ లు కూడా చాలా బ్యాడ్ గా ఉండడంతో మొదటిరోజు కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. మొదటి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 0.26 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక ఈ చిత్రానికి 2.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఇంకా 2.24 కోట్ల షేర్ వరకూ రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే ఈ చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో ఇక బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనీసం లేవు అంటున్నారు ట్రేడ్ పండితులు.

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus