కొరటాల శివ ఇప్పటివరకు 5 సినిమాలకు దర్శకత్వం వహించగా ఆ 5 సినిమాలలో మహేష్ బాబు రెండు సినిమాల్లో హీరోగా నటించారు. సందేశంతో కూడిన సినిమాలను కమర్షియల్ గా తెరకెక్కించి కొరటాల శివ విజయాలను సాధిస్తున్నారు. అయితే ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదట చరణ్ నటించిన రోల్ కోసం కొరటాల శివ మహేష్ ను సంప్రదించారని సమాచారం. అయితే మహేష్ బాబు ఆ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
కొరటాల శివ స్పందిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆచార్య సినిమా దసరాకు రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి చాలా సమయం పట్టేలా ఉంది. థియేటర్లు జులై, ఆగష్టు నుంచి ఓపెన్ అయినా 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఆచార్య దసరాకు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆచార్య సినిమాకు సంబంధించి మరో 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది.
మరోవైపు ఆర్ఆర్ఆర్ దసరా రేసు నుంచి తప్పుకున్నట్టేనని తెలుస్తోంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తైన తరువాత రిలీజ్ డేట్ ను ప్రకటించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రాజమౌళి పలుమార్లు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను ప్రకటించి వేర్వేరు కారణాల వల్ల రిలీజ్ డేట్ ను మార్చిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!