పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంతమేర పూర్తి కాగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటం గమనార్హం. అయితే ఈ సినిమా తేరి సినిమాకు రీమేక్ అని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రచయితగా పని చేస్తున్న దశరథ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందేహాలకు చెక్ పెట్టారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన దశరథ్ తేరి సినిమా నుంచి లైన్ ను మాత్రమే హరీష్ తీసుకున్నారని మిగతా 90 శాతం సొంత కథతోనే ఈ సినిమా తెరకెక్కుతోందని ఆయన కామెంట్లు చేశారు. కథ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనుండగా దశరథ్ ఇచ్చిన క్లారిటీతో పవన్ అభిమానులు కూల్ అవుతారేమో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను త్వరగా పూర్తి చేసి షూటింగ్ లతో బిజీ కానున్నారు. పవన్ తర్వాత సినిమాలపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. పవన్ వరుస సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పవన్ (Pawan Kalyan) తో పని చేయడానికి యంగ్ జనరేషన్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా సినిమాకు పవన్ వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రీమేక్ సినిమాల కంటే స్ట్రెయిట్ సినిమాలకు పవన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. పవన్ ఇతర హీరోలకు భిన్నంగా కెరీర్ కు సంబంధించి అడుగులు వేస్తున్నారు.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!