ఒక్కోసారి భర్త కూడా తప్పు చేస్తాదంటున్న ఉపాసన..!

  • March 7, 2019 / 06:00 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య అయిన ఉపాసన… కుటుంబం పట్ల… అలాగే సమాజం పట్ల కూడా తన వంతు భాద్యతను నిర్వర్తిస్తూ ఎంతో మంది మహిళలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఒక వైపు తన భర్త బిజినెస్ వ్యవహారాల్ని చూసుకుంటూనే.. మరోపక్క తన భర్త నటిస్తున్న షూటింగ్ పిక్స్, అలాగే అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు చరణ్ అభిమానులకి తెలియజేస్తూ… ఖుషీ చేస్తుంటుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాసన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని తెలిపింది.

‘ప్రతీ మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది’… అనే దాని పై మీరేమంటారని ఉపాసనని అడుగగా.. “ఇందుకు సరైన ఉదాహరణ మా అమ్మమ్మ’ ఆమె దృఢమైన మహిళ , ఆమె నుండీ నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. భర్తని విజయవంతంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత భార్య పై ఉంది. ఈ క్రమంలో కొన్నిసార్లు భర్త తప్పులు చేయొచ్చు. అయినప్పటికీ ఆ సమయంలో భార్యలు సైలెంట్ గా ఉండిపోకుండా… కాస్త కఠినంగా ప్రవర్తించి అయినా సరిద్దిద్దాల్సిన అవసరం ఉంది. అంతే కాదు మన భారతీయ సంస్కృతి ఎంతో గొప్పది, మన సమాజంలో మహిళకు ఎంతో గౌరవం ఉంది. మహిళల విషయంలో సమాజంలో ఏమైనా మార్పులు రావాల్సిన అవసరం లేదు…! ఇప్పుడు మహిళలు తమకు కావాల్సింది సాధించుకునే సానుకూల పరిస్థితులు ఉన్నాయి. దానిని ఉపయోగించుకుంటే సరిపోతుంది..” అంటూ ఈ మెగా కోడలు చెప్పుకొచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus