Bro Movie: బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ అనుమతులు లభించడం సాధ్యమేనా?

పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో సినిమా రిలీజ్ కు మరో నెలరోజుల సమయం మాత్రమే ఉంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర చేస్తున్న నేపథ్యంలో రాజమండ్రిలో బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. అయితే ఈ ఈవెంట్ కు జగన్ సర్కార్ నుంచి అనుమతులు లభిస్తాయో లేదో చూడాలి. బ్రో మూవీ కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బ్రో మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం గ్యారంటీ అని తాజాగా రిలీజైన పోస్టర్ ద్వారా క్లారిటీ వచ్చింది. తమ్ముడు మూవీ తరహా గెటప్ తో తాజా పోస్టర్ లో పవన్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుందని తెలుస్తోంది. అటు పవన్, ఇటు సాయితేజ్ సక్సెస్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. పవన్ బ్రో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బ్రో (Bro Movie) సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. బ్రో సినిమా సక్సెస్ సాధిస్తే సముద్రఖని కూడా స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరే ఛాన్స్ ఉంటుంది. బ్రో సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమాకు మంచి లాభాలు వచ్చాయని తెలుస్తోంది. బ్రో సినిమా కమర్షియల్ గా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బ్రో సక్సెస్ సాధిస్తే పవన్ మరిన్ని మల్టీస్టారర్ సినిమాల్లో నటించే ఛాన్స్ ఉంది. పవన్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా బ్రో సక్సెస్ సాధిస్తే పవన్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. పవన్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus