బిగ్‌బాస్‌ 4: కింద మంట… చేతిలో మంచు.. కెప్టెన్సీ తంట

  • October 8, 2020 / 06:24 PM IST

కొత్త కెప్టెన్‌ ఎంపిక కోసం బిగ్‌బాస్‌ ఈ వారం వెరైటీ టాస్క్‌ ఇచ్చాడు. ఇప్పటివరకు ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్‌ల్లో ఇది చాలా క్లిష్టమైనదే అని చెప్పొచ్చు. చేతిలో రెండు బౌల్స్‌లో ఐసు ముక్కలు పెట్టి… ఓ డయాస్‌ మీద ఒంగొని నిలబడిమని చెప్పాడు. పైకి లేచే అవకాశం లేకుండా అడ్డంగా కర్ర అడ్డు పెట్టాడు. అదే సమయంలో కింద నిప్పుల కుంపటి పెట్టాడు. మరి ఇందులో ఎవరు గెలిచారో ఈ రోజు రాత్రి తెలుస్తుంది.

బీబీ గ్రాండ్‌ హోటల్‌ టాస్క్‌ ముగిసిన తర్వాత కెప్టెన్సీ పోటీ రేసులో ముగ్గురు నిలిచారు. సీక్రెట్‌ టాస్క్‌ ఆడిన అవినాష్‌, అతిథుల టీమ్‌లో ఉన్న సోహైల్‌ వారిలో ఇద్దరు. మరి అఖిల్‌ ఏ కోటాలో వచ్చాడో తెలియదు కానీ అతనూ ఉన్నాడు. ఇందులో అఖిల్‌ చేతిలో మంచును, కింద వేడిని తట్టుకోలేక మధ్యలోనే డయాస్‌ మీద నుంచి కిందకు దిగేశాడు. దీంతో సోహైల్‌, అవినాష్‌ మాత్రమే పోటీలో నిలిచారు. వీరిలో విజేత ఎవరనేది రాత్రికి తెలుస్తుంది. అన్నట్లు ఈ టాస్క్‌కు అభిజీత్‌ సంచాలకుడిగా వ్యవహరించాడు.


చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus