This Weekend Releases: ఈ వారం థియేటర్లు/ ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే!

బాక్సాఫీసు దగ్గర అదృష్టం పరీక్షించుకోవడానికి, ఓటీటీలో సత్తా చూపించడానికి ఈ వారం కూడా కొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్‌లో స్టార్‌ సినిమాలేవీ లేవు కానీ, మంచి స్క్రిప్ట్‌లు ఉన్నాయి. అలాగే ఓటీటీలో అయితే గతంలో ఫలితం తేలిపోయిన సినిమాలున్నాయి. ఆ వివరాలేంటో చూసేయండి మరి.

* లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. ‘మత్తు వదలరా’ సినిమాతోతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రాణా తెరకెక్కించిన సినిమా ఇది. నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ కీలకపాత్రధారులు. జూలై 8న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.

* మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సినిమా ‘కడువా’. జూలై 7న సినిమాను విడుదల చేస్తున్నారు. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

* పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడిగా చదలవాడ శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్’. 90వ దశకంలోని సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఒక నక్సలైట్ తండ్రి కథ. జులై 8న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

* ప్రముఖ నటుడు సత్యరాజ్ కుమారుడు సిబి రాజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘మాయోన్’. కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో 7న విడుదల చేస్తున్నారు.

పైవన్నీ థియేటర్లలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సినిమాలు. ఇక ఓటీటీ సంగతికొస్తే…

* కమల్ హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కంచిన సూపర్‌ హిట్ సినిమా ‘విక్రమ్‌’. జూన్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను జూలై 8 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ‘విక్రమ్’ వీక్షకులకు అందుబాటులో ఉండనుంది.

* రేవతి, నిత్యా మీనన్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, అభిజిత్, మాళవిక నాయర్, సుహాసిని, నరేష్ అగస్త్య, ఉల్కా గుప్తా, నరేష్, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన వెబ్ సిరీస్ ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’. ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌ జులై 8 నుండి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతుంది. నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.

* థియేటర్లలో విడుదలై సరైన విజయం అందుకోని చిత్రం నాని ‘అంటే సుందరానికి’. జూన్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో జూలై 10 నుండి అందుబాటులో ఉంటుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus