బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఎలిమినేషన్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కి కూడా టెన్షన్ గా ఉంటుంది. అయితే, ఇప్పుడు 12వ వారం కింగ్ నాగార్జున ఆల్రెడీ డబుల్ ఎలిమినేషన్ అనేది ఎనౌన్స్ చేశారు కాబట్టి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. ప్రస్తుతం అన్ అఫీషియల్ ఓటింగ్ అనేది చూసినట్లయితే., పల్లవి ప్రశాంత్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. ఇది పల్లవి ప్రశాంత్ ఓటింగ్ ప్రభంజనం అని చెప్పచ్చు.
దాదాపుగా 32 శాతం వరకూ కూడా పల్లవి ప్రశాంత్ కి ఓటింగ్ జరిగింది. బిగ్ బాస్ లో ఆఖరి వారం కూడా ఇదే ఓటింగ్ ఉంటే మాత్రం ఇది విన్నింగ్ డిసైడ్ ఓటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈసారి నామినేషన్స్ లో అందరూ ఉన్నారు కాబట్టి ఈరకమైన ఓటింగ్ జరగడం అనేది విన్నర్ ని డిసైడ్ చేస్తుందనే చెప్పాలి. టైటిల్ రేస్ లో శివాజీ ఉన్నాడు. శివాజీకి కూడా 23శాతం వరకూ ఓటింగ్ అనేది జరిగింది. సేఫ్ జోన్ లోనే ఉన్నారు. తర్వాత అమర్ ఉన్నాడు అమర్ కి కూడా 20శాతం వరకూ ఓటింగ్ అనేది జరిగింది.
ఈ ముగ్గురే దాదాపుగా 80శాతం ఓటింగ్ ని కైవసం చేసుకున్నారు. ఇక మిగిలిన ఐదుగురు 20శాతం ఓటింగ్ ని పంచుకున్నారు. ఇందులో యావర్ 6, గౌతమ్ 5, అర్జున్ 4 పర్సెంట్ వరకూ ఓటింగ్ ని కైవసం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఐదుగురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే, అన్ని అన్ అఫీషియల్ ఓటింగ్ సైట్స్ లో కూడా రతిక, అశ్విని ఇద్దరే బోటమ్ లో ఉన్నారు. అలాగే, అర్జున్ – గౌతమ్ కి కూడా ఓటింగ్ అనేది పెద్దగా జరగలేదు. యావర్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.
పల్లవి ప్రశాంత్ దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీపాస్ అనేది ఇప్పుడు కీలకం. శివాజీని లాస్ట్ వరకూ పెట్టి లేదా యావర్ ని లాస్ట్ వరకూ పెట్టి బిగ్ బాస్ గేమ్ ఆడచ్చు. లేదా పల్లవినే లాస్ట్ వరకూ సేవ్ చేయకుండా పెట్టినా సరే తనకోసం పాస్ వాడతాడేమో టెస్ట్ కూడా చేయచ్చు. చాలా సీజన్స్ లో ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అన్ ఫైయిర్ ఎలిమినేషన్ కి దారితీసింది. మరి ఇప్పుడు బిగ్ బాస్ ఏదైనా అన్ ఫైయిర్ ఎలిమినేషన్ చేస్తే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోద్ది. మరి ఈ డబుల్ (Bigg Boss 7 Telugu) ఎలిమినేషన్ లో, ఎవిక్షన్ ఫ్రీ పాస్ లో ఎవరు బలైపోతున్నారు అనేది చూడాలి. అదీ మేటర్.