“మహానటి” కోసం పోటీ పడుతున్న ముగ్గురు..!!

అలనాటి మేటి నటి సావిత్రి జీవితాన్ని తెరపైన చూపించడానికి దర్శకుడు నాగ అశ్విన్ ప్రయత్నాల్లో ఉన్నారు. గతఏడాది ఎవడే సుబ్రమణ్యం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నఈ డైరక్టర్ “మహానటి” పేరుతో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సావిత్రి దక్షిణాది అన్ని భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఈ ఫిల్మ్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషలో నిర్మించాలని, ఐదు భాషల్లో విడుదల  చేయాలని అశ్విన్ భావిస్తున్నారు. ఇప్పుడు సావిత్రి పాత్రను పోషించే నటి కోసం వెతుకుతున్నారు.

బాగా నటించే సత్తాతో పాటు పలు భాషల్లో ఆమె పరిచయం ఉంటే బిజినెస్ పరంగా బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఈ పాత్ర కోసం అనుష్క, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముగ్గురూ మహానటిగా మెప్పించాలని ఆశపడుతున్నారు. సోనాక్షి సిన్హా బాగా నటించ గలిగినా ఆమెను హిందీలో తప్ప ఇతర భాషల్లో గుర్తుపట్టలేరు. అందుకే సోనాని చిత్ర బృందం సీరియస్ గా తీసుకోవడం లేదని వినికిడి. ముఖ్యంగా అనుష్క, విద్యాబాలన్ మధ్య పోటీ ఉందని తెలిసింది.

స్వీటీకి దక్షిణాది భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అరుంధతి వంటి లేడి ఓరియంటెడ్ చిత్రాలకు సూట్ అవుతానని చెప్పకనే చెప్పింది. విద్యా ఇప్పటికే సిల్క్ స్మిత బయో పిక్ “డర్టీ పిక్చర్” సినిమాతో ప్రతిభను నిరూపించుకుంది. హిందీ తో పాటు ఇతర భాషల్లోనూ విద్య పాపులర్ అయింది. ఇలా అనుష్క, విద్యాలు ఇద్దరూ ఇద్దరే. మరి మహానటి అవకాశం ఎవరికి వరిస్తుందో ? వేచి చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus