Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

విజయ్‌ దేవరకొండ జీవితంలో 2026 చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఆయన పర్సనల్ లైఫ్‌, ప్రొఫెషనల్ లైఫ్‌లో మార్పులు రాబోతున్నాయి. రాబోయే మార్పులన్నీ R చుట్టూనే తిరుగుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయా అంశాల పేర్లు అన్నీ Rతోనే స్టార్ట్‌ కాబోతున్నాయి. కావాలంటే మీరే చూసుకోండి. తొలుత పర్సనల్‌ లైఫ్‌ గురించి చూద్దాం. విజయ్‌ టీమ్‌ బయటకు ఇచ్చిన రూమర్స్‌ ప్రకారం చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన పెళ్లి జరగబోతోంది.

Vijay Devarakonda

అలా తన లైఫ్‌లోకి ఓ R ని తీసుకురాబోతున్నాడు విజయ్‌. వీరి పెళ్లి రాజస్థాన్‌లో జరగబోతోంది అని సమాచారం. రాజస్థాన్‌ పేరు స్టార్ట్‌ అయ్యేది Rతోనే. ఇక వృత్తిగత జీవితంలోకి వస్తే రెండు సినిమాలు ఈ ఏడాది చేయబోతున్నాడు విజయ్‌. ఆ రెండూ ఈ సంవత్సరంలోనే రిలీజ్‌ అవుతాయి అని చెబుతున్నారు. ఆ సినిమా పేర్లు ‘రౌడీ జనార్ధన’, ‘రణబాలి’. ఈ రెండు టైటిల్స్‌ ఏ లెటర్‌తో స్టార్ట్‌ అవుతున్నాయో మీకు అర్థమయ్యే ఉంటుంది.

ఇక్కడే ఇంకో విషయం ఉంది. ఈ రెండు సినిమాలను తెరకెక్కించబోయేది దర్శకులు రవికిరణ్‌ కోలా, రాహుల్‌ సాంకృత్యాన్‌. పేర్లు చెప్పగానే మీకు విషయం అర్థమైపోయుంటుంది. అన్నట్లు ఈ రెండు సినిమాల నిర్మాతల పేర్లు కూడా R అనే అక్షరంతోనే స్టార్ట్‌ అవుతాయి. ఇలా ఎటు చూసినా 2026లో విజయ్‌ లైఫ్‌ అంతా R చుట్టూనే తిరుగుతుంది. చూద్దాం మరి ఆయనకు ఈ లెటర్‌ ఎంతవరకు లక్‌ ఇస్తుందో. ఇదేంటి ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఉంటాయా అని మీరు అనుకోవచ్చు. ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సాధ్యమే.

ఇక్కడో విషయం ఉంది ఇప్పటివరకు విజయ్‌ R అనే అక్షరంతో స్టార్టయ్యే టైటిల్‌తో సినిమానే చేయలేదు. ఇప్పుడే చేస్తున్నాడు. ఇక సినిమాలో పాత్ర పేరు సంగతి చూస్తే.. Rishi అని తొలి సినిమాలో చేశాడు. మంచి పేరే సంపాదించాడు.

2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus