రవితేజ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ అక్టోబర్ నెల 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం ఈ సినిమాకు ప్లస్ అయిందని సమాచారం. తెలుస్తున్న సమాచారం ప్రకారం టైగర్ నాగేశ్వరరావు నాన్ థియేట్రికల్ హక్కులు 49 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.
తెలుగు రాష్ట్రాల హక్కులు 30 కోట్ల రూపాయలకు అమ్ముడవగా నైజాం అడ్వాన్స్ బేసిస్ మీద థియేటర్లలో విడుదలవుతోంది. ఓవర్సీస్, కర్ణాటక డీల్స్ ఫైనల్ కావాల్సి ఉందని సమాచారం అందుతోంది. దసరా సీజన్ లో టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కానుండటంతో టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. శాటిలైట్ కాకుండానే టైగర్ నాగేశ్వరరావు నాన్ థియేట్రికల్ హక్కులు 49 కోట్ల రూపాయలకు అమ్ముడవడంతో రిలీజ్ కు ముందే ఈ సినిమా నిర్మాతలకు రికార్డ్ స్థాయిలో లాభాలు వస్తున్నాయి.
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆ లాభాలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకోగా సినిమా (Tiger Nageswara Rao) రిలీజ్ సమయానికి ఆ సమస్యలు కూడా పరిష్కారం కానున్నాయని తెలుస్తోంది.
మాస్ మహారాజ్ రవితేజ తర్వాత ప్రాజెక్ట్ లతో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రావణాసుర తర్వాత రవితేజ నటించి థియేటర్లలో విడుదలవుతున్న మూవీ ఇదే కావడం గమనార్హం.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!