Tiger Nageswara Rao: ఏ తెలుగు సినిమా విడుదల కాని భాషలో! ‘టైగర్‌..’ వస్తున్నాడా?

  • October 6, 2023 / 03:45 PM IST

‘టైగర్‌ నాగేశ్వరావు’ సినిమా విషయంలో రవితేజ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ మాట మేం అనడం లేదు. సినిమా గురించి టీమ్‌ చేస్తున్న ప్రయత్నాలు, ప్రచారాలు, పడుతున్న కష్టం లాంటివి చెబుతున్నాయి. తాజాగా సినిమా గురించి బయటకు వచ్చిన ఓ వార్త దీనికి మరింత బలం చేకూరుస్తోంది. దసరా సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమాను ఏకంగా సైన్‌ లాంగ్వేజ్‌లో రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే పాన్‌ ఇండియా లెవల్‌ రిలీజ్‌ అవుతున్న సినిమాకు ఇది యాడ్‌ ఆన్‌ అని చెప్పాలి.

రవితేజకు మాస్‌ హీరో అని పేరు ఉంది. అయితే అది తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం. గతంలో ఎప్పుడో చిన్న ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు, దర్శకత్వ శాఖలో పని చేసినప్పుడు ఇతర భాషల్లో నటించాడు అంటారు. అయితే ఇప్పుడు ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో పాన్‌ ఇండియా రిలీజ్‌ చేసి పాన్‌ ఇండియా హీరో అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ సినిమాలో ఉన్న స్టఫ్‌ కూడా అలాంటిది అని ఓ టాక్‌. అయితే ఈ సినిమా ముందుగా అనుకున్న భాషల్లో కాకుండా మరో భాషలోనూ తీసుకొస్తున్నారని ఓ టాక్‌.

స్టువర్ట్‌పురం దొంగలకు మహారాజుగా వెలిగిపోయిన ‘టైగర్ నాగేశ్వర రావు’ అనే వ్యక్తి బయోపిక్‌తో ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమా హిందీలో థియేటర్లలో రాలేదు. ఇదే తొలిసారి. అలాగే వినికిడి లోపం ఉన్న దివ్యాంగుల కోసం ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (ఐఎస్‌ఎల్)లో విడుదల చేయాలని నిర్ణయించారట. త్వరలో దీని గురించి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటివరకు కొన్ని భారతీయ ఇండియన్ సినిమాలు సైన్‌ లాంగ్వేజ్‌లో వచ్చాయి. (Tiger Nageswara Rao) ‘టైగర్ నాగేశ్వరరావు’ అలా వస్తే తెలుగు నుండి తొలి సినిమా అవుతుంది. వంశీ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈలోపు సైన్‌ లాంగ్వేజ్‌ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేస్తుంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus