Tiger Nageswara Rao: ‘టైగర్‌’ నేర్పుతున్న ‘థియేటర్ల’ పాఠం… నేర్చుకునేవాళ్లెవరు?

  • October 9, 2023 / 04:40 PM IST

రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్ల సమస్య తెర మీదకు వస్తుంది.. ఇదో రకం. దీనికి ఇప్పటివరకు సరైన సొల్యూషన్‌ దొరకలేదు. ఏటా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పటికిప్పుడు ఏర్పాట్లే. అయితే ఇక్కడ మరో రకం ఉంది… అదే ఓ తెలుగు సినిమా, మరో తమిళ డబ్బింగ్‌ సినిమా. ఇటీవల కాలంలో ఈ సమస్య కూడా పెరుగుతోంది. మన దగ్గర స్టార్‌ హీరోల సినిమా వచ్చినప్పడు తమిళ సినిమాలే వస్తున్నాయి. దాంతో ఇక్కడ థియేటర్ల కోసం చిన్న సైజ్‌ యుద్ధాలు జరుగుతున్నాయి.

అదేంటీ… ఇప్పుడు అంతా పాన్‌ ఇండియా కదా… ఎక్కడ సినిమానైనా మనం ఆదరిస్తున్నాం. కాబట్టి థియేటర్లు అందరికీ ఇవ్వాలి అనుకోవచ్చు మీరు. అయితే ఇలా మనం మాత్రం అనుకుంటే సరిపోదు కదా… మిగిలిన వాళ్లు కూడా అనుకోవాలి. ముఖ్యంగా తమిళనాట కూడా అదే పని చేయాలి. వాళ్లు అలా లేరు అనడానికి లేటెస్ట్‌ ఎంగ్జాంపుల్‌ ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబరు 20న విడుదల చేస్తున్నారు.

పాన్‌ ఇండియా లెవల్‌లో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సినిమాను రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముంబయి వెళ్లి మరీ రవితేజ ఈ సినిమాను ప్రమోట్‌ చేసి వచ్చాడు. అయితే తమిళనాట మాత్రం సరైన రిలీజ్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ‘లియో’ సినిమా ఉంది అనే నెపంతో పంపిణీదారులు కూడా తెలుగు సినిమాలవైపు చూడటం లేదు. దీంతో థియేటర్లు దొరికే పరిస్థితి లేదు అంటున్నారు. ఒకవేళ దొరికినా అరాకొరనే అని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మన దగ్గర తమిళ డబ్బింగ్‌ సినిమాలకు థియేటర్లు ఎగబడి ఇచ్చేస్తారు. అక్కడ మాత్రం మనకు సరైన రెస్పాన్స్‌ లేదు అనే చర్చ మొదలైంది. మరి ఈ విషయంలో మన నిర్మాతలు ఎలాంటి ఆలోచన చేస్తారో చూడాలి. మనకు ఎదురైన అనుభవం వాళ్లకూ రుచి చూపించాలి అనే టాక్‌ సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. మరి ఆ మాటలు టాలీవుడ్‌ చెవిన పడతాయో లేదో.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus