Tillu Square: ఆ తేదీన టిల్లు స్క్వేర్ మూవీని ప్రకటించడం వెనుక అసలు లెక్కలివేనా?

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర మూవీ వాయిదా పడినట్టు అధికారికంగా ప్రకటించకపోయినా ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ మార్పు ఖాయమేనని తెలుస్తోంది. మార్చి నెల 29వ తేదీన టిల్లు స్క్వేర్ మూవీని ప్రకటించడంతో దేవర వాయిదా విషయంలో క్లారిటీ వచ్చేదింది. దేవర రిలీజ్ డేట్ కు ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు అన్నీ ప్రకటించిన డేట్ కు రిలీజ్ కావడం లేదు.

దేవర ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావించగా దేవర కూడా పోస్ట్ పోన్ కావడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. అయితే అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలను నమ్మాల్సి ఉంటుంది. ఏప్రిల్ 5 తర్వాత వరుసగా సెలవులు ఉండటంతో ఆ డేట్ కు అటూఇటుగా ఎక్కువ సినిమాలు రిలీజవుతున్నాయి. మరోవైపు దేవర పోస్ట్ పోన్ అయితే ఆ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ను సెట్ చేసుకోవడం సులువు కాదు.

ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే దేవర రిలీజ్ కు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దేవర సినిమా విషయంలో నిర్మాతల ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. దేవర సినిమా రిలీజ్ డేట్ మారకుండా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సైఫ్ అలీ ఖాన్ నెల రోజుల్లో కోలుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవర విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. దేవర సినిమా కాన్సెప్ట్ సరికొత్తగా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కొరటాల శివ ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలో టాలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల గురించి పూర్తి క్లారిటీ రానుంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus